అమరావతి ఉద్యమాన్ని, రైతులను, మహిళలను అవమానిస్తూ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రైతులను రెచ్చగొట్టి, ఉద్యమం నడపడానికి పెయిడ్ వర్కర్స్‌ను పెడుతున్నారని ధర్మాన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. మరోవైపు, రైతులను కించపరిచేలా మాట్లాడిన కృష్ణదాస్‌కి అదే జిల్లాకు చెందిన మంత్రి సీదిరి అప్పలరాజు వత్తాసు పలికడం చర్చనీయాంశమైంది. ధర్మాన మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదని అప్పలరాజు సమర్థించారు. దీంతో, ఆ ఇద్దరు మంత్రులు తక్షణమే రాజీనామా చేయాలని టీడీపీ మహిళా నేతలు డిమాండ్ చేశారు. అమరావతి రైతులను కించపర్చేలా మాట్లాడిన మంత్రుల తీరుకు నిరసనగా తెలియజేసిన అమరావతి రైతులను తుళ్లూరు పోలీసులు అరెస్టు చేయడం కలకలం రేపింది.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ మంత్రులిద్దరిపై అమరావతికి చెందిన దళిత జేఏసీ నేతలు ఫిర్యాదు చేశారు. మహిళలను కించపరిచే విధంగా మంత్రులు ధర్మాన కృష్ణదాస్, సీదిరి అప్పలరాజు మాట్లాడారని గుంటూరు జిల్లా తుళ్లూరు డీఎస్పీకి దళిత జేఏసీ నేతలు ఫిర్యాదు చేశారు. దళిత మహిళలను కించపరిచేలా మంత్రులు వ్యాఖ్యానించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దళిత మహిళల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యానించిన ఆ ఇద్దరు మంత్రులపై చర్యలు తీసుకోవాలని కోరారు. దిశ చట్టం కింద ఆ ఇద్దరు మంత్రులపై కేసులు నమోదు చేయాలని తమ ఫిర్యాదులో దళిత జేఏసీ మహిళా నేతలు కోరారు.