యూట్యూబ్... కావాల్సిన వీడియోను అందించే ఫ్లాట్‌ఫామ్‌గానే మనకు తెలుసు. అంతేకాదండోయ్... మనం రూపొందించిన వీడియోను చాలా తక్కువ సమయంలోనే చాలా ఎక్కువ మందికి చేరవేసే సమాచార సాధనంగా, సోషల్ మీడియాలో అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తున్న వేదికగానూ మనకు తెలుసు. అంతేనా... అంటే... అంతే కాదనే చెప్పాలి. యూట్యూబ్ వేదికగా కోట్లాది రూపాయలు సంపాదిస్తున్న వారు కూడా మనకు ఇప్పుడు తారసపడుతున్నారు. అలాంటి వారి విషయానికి వస్తే... ఏదో ఓ మోస్తరుగా ఆదాయాన్ని సంపాదిస్తున్న వారే మనకు తెలుసు గానీ... నిజంగానే కోట్లలో, అది కూడా వందలాది కోట్ల మొత్తాన్ని సంపాదిస్తున్న వారు ఉన్నారంటే మాత్రం ఆశ్చర్యం కలగక మానదు.
అలాంటి ఆశ్చర్యకర విషయంతో వార్తల్లోకి ఎక్కిన ఓ బ్రిటిష్ యువకుడు ఇప్పుడు... యూట్యూబ్ పర్సన్ గా మారిపోవడంతో పాటుగా సంపన్నుల జాబితా విడుదల చేసే ఫోర్బ్స్ పత్రికకు కూడా ఎక్కేశాడు. వినడానికి కాస్తంత ఆశ్చర్యంగా ఉన్నా కూడా ఇది ముమ్మాటికీ నిజమేనని చెప్పాలి. ఏడాదికి రూ.170 కోట్ల మేర సంపాదించి అతడి గాథను వింటే మాత్రం మనకు నిజంగానే ఆశ్చర్యం కలగక మానదు. ఆ యువకుడు ఎవరో, ఆ కథమేమిటో చూద్దామా? బ‌్రిటన్ కు చెందిన గ్రాసరీ స్టోర్ టెస్కోలో చాలా కాలం పాటు పనిచేసి ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి పారేసి బయటపడిపోయిన డాన్ మిడిల్టన్ అనే యువకుడు... ఆ తర్వాత డాన్ టీడీఎం పేరిట యూట్యూబ్ లో ఓ ఛానెల్ ను ఏర్పాటు చేశారు. వీడియో గేమ్ ల ఆధారంగా రూపొందించిన సదరు ఛానెల్ లో ఆయా గేమ్ లను ఎలా ఆడాలి? ఆయా గేమ్ లు ఎలా ఉన్నాయి? అన్న అంశాలపై తనదైన శైలిలో సలహాలు - రివ్యూలు పోస్ట్ చేస్తూ వచ్చిన డాన్... తన ఛానెల్ కు ఏకంగా 1.70 కోట్ల మంది సబ్ స్క్రైబర్లను పోగేసుకున్నాడు.
ఇంత మేర భారీ సంఖ్యలో వీక్షకులను తన ఛానెల్ కు సంపాదించిన డాన్... గడచిన ఏడాది (జూన్ 1 2016 నుంచి జూన్ 1 2017 మధ్య కాలంలో ఏకంగా 16.5 మిలియన్ డాలర్ల మేర సొమ్మును ఆర్జించాడు. ఈ సొమ్ము మన కరెన్సీలో లెక్కిస్తే... ఏకంగా రూ.170 కోట్లకు సమానమట. ఇంతటి సంపాదనతో డాన్ ఒక్కసారిగా ఫోర్బ్స్ పత్రికలో *ద హయ్యెస్ట్ పెయిడ్ యూట్యూట్ స్టార్-2017*గా రికార్డులకెక్కాడు. ఇదిలా ఉంటే మొత్తం టాప్ టెన్ యూట్యూబ్ స్టార్లంతా కలిసి సంపాదించిన మొత్తం రూ.188 కోట్లు కాగా... అందులో డాన్ వాటానే రూ.170 కోట్లు ఉందట. అంటే... డాన్ తర్వాతి స్థానాల్లో నిలిచిన 9 మంది స్టార్లు కలిసి సంపాదించిన మొత్తం కేవలం రూ. 10 కోట్లేనన్నమాట.