రోజురోజుకి భానుడి ప్రతాపం పెరిగిపోతుంది. పెరుగుతున్న ఎండల మాటునే అతినీల లోహిత కిరణాలు (యూవీ) భూమిపైకి చేరుకుంటున్నాయి. గత కొన్ని రోజులుగా వీటి ప్రభావం హైదరాబాద్ లో తీవ్రంగా ఉందని ప్రపంచ పర్యావరణ సంస్థ (WEO) ఆందోళన వ్యక్తం చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లో ప్రస్తుతం యూవీ కిరణాల స్థాయి ప్రమాదంగా తయారైంది. వేసవి ఎండలు పంజా విసురుతుండగా మరో వారం రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని అంచనా వేశారు అధికారులు.
వివిధ నగరాల్లో యూవీ సూచికను రూపొందిస్తున్న డబ్ల్యూఈవో తాజాగా హైదరాబాద్ లో యూవీ సూచిక ప్రమాదకర స్థాయికి చేరుకున్నట్టు ప్రకటించింది. యూవీ కిరణాలు శరీరం పై పడితే అలర్జీలు, కళ్లకు సంబంధించిన సమస్యలు వస్తాయి. యూవీ కిరణాల కారణంగానే వేసవిలో చర్మ, కళ్ల సంబంధ సమస్యలతో వైద్యులను ఆశ్రయించే వారి సంఖ్య ఎక్కువని వైద్యులు కూడా చెబుతున్నారు.
సూర్యుడి నుంచి వెలువడే అతినీల లోహిత కిరణాలను సహజంగా స్ట్రాటోస్పియర్ లో ఉండే ఓజోన్ పొర అడ్డుకుంటుంది. సూర్యుడి నుంచి వచ్చే కిరణాల తీవ్రత పెరిగే కొద్దీ ఈ పొర మందం తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. దీని ద్వారా చర్మ సంబంధమైన అలర్జీలు, కళ్ల రుగ్మతలకు కారణమవుతాయి. సాధారణ రోజులతో పోలిస్తే ఎండాకాలం ఈ సమస్యలతో వైద్యులను సంప్రదించే వారి సంఖ్య 20 శాతం పెరుగుతుందని సమాచారం