చలికి కరోనా తీవ్రం.. చిగురుటాకులా వణుకుతున్న అమెరికా

Update: 2020-10-06 00:30 GMT
మామూలుగానే కరోనా తాకుతుంటే చాలు వస్తోంది. కొంతమంది వైరస్ కు బయపడి ఇళ్లల్లోనే ఉంటున్నా వారిని కూడా వదలడం లేదు. మండు వేసవిలోనూ కరోనా విజృంభణ కొనసాగింది. ఆ తర్వాత వర్షా  కాలం రావడంతో  మరింత వేగంగా విస్తరించింది. ఇక చలికాలం వస్తే కరోనా మహమ్మారి మరింత తీవ్రరూపం దాలుస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తూ వస్తున్నారు. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో అమెరికాలో చలి కాలం వచ్చేయడంతో కరోనా కేసులు మరింత పెరుగుతున్నాయి. దాదాపు తొమ్మిది రాష్ట్రాల్లో కేసుల సంఖ్య భారీగా పెరుగుటోంది. చలి తీవ్రత పెరుగుతుండటంతో కరోనా విజృంభిస్తున్నదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికాలోని పశ్చిమ ప్రాంతాల్లో కేసుల సంఖ్య మరింత పెరుగుటోంది. కెంటుకీ, మిన్నెసోటా, మోంటానా, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో కొత్త కేసులు భారీగా నమోదవుతున్నాయి.

ఈ  నాలుగు రాష్ట్రాల్లోనే గత శనివారం 49 వేల కేసులు నమోదు అయ్యాయి. కాన్సాస్, నెబ్రాస్కా, న్యూ హాంప్‌షైర్, సౌత్ డకోటా, వ్యోమింగ్ ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో కేసులు పెరుగుతున్నాయి. ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఒక్క న్యూయార్క్ ​లో మాత్రం కేసుల సంఖ్య పెరగడం లేదు. అయితే ప్రస్తుతం న్యూయార్క్ మేయర్ బిల్ దే బ్లాసియో మాత్రం వ్యాపార సంస్థలను మూసేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనికోసం ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉంది. వాతావరణం చల్లగా ఉంటే కరోనా పెరుగుతుందని  ఆరోగ్యశాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికాలోని చాలా ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రత 10 డిగ్రీల కంటే తక్కువగా ఉంది. దీంతో ప్రజలో ఆందోళన నెలకొంది.
Tags:    

Similar News