విశాఖలో కరోనా బుసలు .. జోన్‌-2 - జోన్‌-3 లో ఉండే వారు తస్మాత్ జాగ్రత్త !

Update: 2020-09-05 07:30 GMT
ఏపీలో కరోనా మహమ్మారి జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ మధ్య కాలంలో ప్రతిరోజూ కూడా దాదాపుగా 10 వేలకి పైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఇక రాష్ట్రంలో విశాఖ జిల్లాలో  కరోనా విలయతాండవం చేస్తుంది. విశాఖపట్నంలో రోజురోజుకి నమోదు అయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య నగర వాసుల్ని తీవ్ర భయబ్రాంతులకు గురిచేస్తుంది. ముఖ్యంగా జోన్‌-2, జోన్‌-3 లో కరోనా నిర్దారణ పరీక్షలు చేసేకొద్ది పాజిటివ్‌ రోగుల సంఖ్య పెరుగుతోంది. జీవీఎంసీ నుంచి బృందాలు జోన్‌-2, జోన్‌-3 ప్రాంతాల్లో పర్యటిస్తూ కరోనా స్థితిని అంచనా వేస్తున్నారు.  

ఆగస్టు 31 వరకూ తేలిన లెక్కల ప్రకారం గత రెండు వారాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. నగరంలో 46 వెరీయాక్టివ్‌ క్లస్టర్లు, 52 యాక్టివ్‌ క్లస్టర్లు ఉన్నాయి. కేవలం వీటి ద్వారానే 14 రోజుల వ్యవధిలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ క్లస్టర్లన్నీ కూడా జోన్‌-2, జోన్‌-3కి చెందినవేనట. దీనితో ఈ జోన్లలో ఉండే ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. విశాఖపట్నంలో ఎక్కడలేని రద్దీ  కేవలం జోన్‌-2,3ల్లోనే ఉన్నాయి. వ్యాపార సముదాయాలు, బీచ్‌ ఇతర విడిది ప్రాంతాలు ఎక్కువ. ఫిషింగ్ ‌హార్బర్‌, జాలారిపేట, జగదాంబకూడలి, పూర్ణామార్కెట్‌, అల్లిపురం మార్కెట్‌, డాబాగార్డెన్‌, స్ప్రింగ్ ‌రోడ్‌ వంటి ప్రాంతాల్లో రద్దీ ఎక్కువ. కేసుల పెరగడంపై ఆరా తీసిన అధికారులు కొన్ని అంశాలను గమనించారు.

ప్రస్తుతం కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో జనాలు ఎక్కువమంది ఉన్నారు. వీధులు, ఇళ్లు చాలా వరకు కిక్కిరిసి ఉన్నాయి. జాలారిపేట, పెదజాలారిపేట, కేఆర్‌ ఎం  కాలనీ, అప్పూగర్‌, మద్దిపాలెం, చినవాల్తేరు లాంటి ప్రాంతాల్లో ఇదే తేలింది. నగరంలో ఇతరప్రాంతాలతో పోల్చితే ఇక్కడే జనసంచారం బాగా ఎక్కువగా ఉందట. అలాగే ,  చాలామంది కరోనాకి తగిన జాగ్రత్తలు తీసుకోవట్లేదని ,పేస్ మాస్క్‌ లు , శానిటైజేర్ లు కూడా సరిగా వాడట్లేదని ఈ కారణంగానే కరోనా విజృంభిస్తుంది అని వెల్లడించారు. ఈ జోన్లలో చాలా ప్రాంతాల నుంచి కేసులు వస్తుండటంతో కంటైన్మెంట్‌లు చేయడానికి కష్టమవుతోంది. ఈ ప్రాంతాల్లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో కరోనాను కట్టడి చేయడానికి అధికారులు ప్లాన్స్ వేస్తున్నారు.
Tags:    

Similar News