ఏపీలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకి భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో సామాన్యుల నుండి ప్రముఖుల వరకు అందరూ కరోనా భారిన పడుతున్నారు. గడిచిన 24 గంటల్లో 7,956 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు ఏపీ వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. నిన్న ఒక్క రోజే 9,764 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 60 మంది మరణించారు. తాజా లెక్కలతో ఏపీలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,75,079 కి చేరింది. కరోనాను జయించి వీరిలో 4,76,903 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఏపీలో ప్రస్తుతం 93,204 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 4,972 మంది మరణించారు.
ఇక, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక చర్యల వల్ల 300 మంది ఖైదీలు కరోనా పై విజయం సాధించి బయట పడ్డారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు గత నెలలో కరోనా బారినపడ్డారు. ఈ జైలులో 1,700 మంది ఖైదీలకు కరోనా పరీక్షలు నిర్వహించగా.. 300 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీరి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు కరోనా బారిన పడిన ఖైదీలకు ప్రత్యేక బ్యారక్ ఏర్పాటు చేసి మిగిలిన ఖైదీలతో కలవకుండా చర్యలు చేపట్టి చికిత్స అందించారు.
ఖైదీలు కరోనా బారినపడిన వెంటనే పూర్తిస్థాయి వైద్యంతో పాటు బలవర్ధక ఆహారం అందించేందుకు ప్రత్యేక నిధులు కేటాయించారు. ఎప్పటికప్పుడు ఆక్సిజన్ పరీక్షలు నిర్వహించడంతో పాటు రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులున్న ఖైదీలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రత్యేకంగా వైద్య సేవలందించారు. కరోనా బాధితులందరికీ చికిత్స అనంతరం పరీక్షలు చేయగా నెగెటివ్ వచ్చిందని జైలు అధికారులు, వైద్యులు ధ్రువీకరించారు.