కరోనా వైరస్ మిగిల్చిన విషాదాలు.. ఆర్థిక ఇబ్బందులు ప్రజలను పట్టి పీడిస్తున్నాయి. వైరస్ ను ఎదుర్కొని బతుకు జీవుడా అంటూ బయటపడిన వారు కూడా ఆస్పత్రుల్లో ఖర్చులు చూసి ఆర్థిక భారంతో చస్తున్న వారు ఎందరో ఉన్నారు. కరోనాను జయించి బతికినా.. చేసిన అప్పులు తీర్చే మార్గం లేక కుమిలిపోతున్న పరిస్థితి నెలకొంది.
చైనాలో పుట్టిన కరోనా వైరస్ మొదట పట్టణాల్లోనే విజృంభించింది. ఆ తరువాత పల్లెలకు పాకి ప్రజల జీవనవ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. కరోనా రాకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో రకంగా వైరస్ బారినపడడం ఇప్పుడు కామన్ అయిపోయింది. మన ఊర్లోనే కాదు.. మన పక్కనే కరోనా ఉన్నా కూడా తెలియని పరిస్థితి నెలకొంది.
కరోనా వైరస్ ప్రజల ఆరోగ్యాన్నే కాకుండా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి తగ్గి ఆర్థికంగా పుంజుకుంటుందని అందరూ అంటున్నా గ్రామాల్లో పరిస్థితి మాత్రం భయానకంగా ఉంది. కరోనా వైరస్ ప్రభావం తగ్గినా కానీ కొన్ని గ్రామాలు, పట్టణాల్లోని పేదలు, మధ్యతరగతి వారు ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతిన్నారు. ఇందుకు ఉదాహరణంగా ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా ఉదాహరణగా తీసుకోవచ్చు.
దేశంలోనే కరోనా తీవ్రతలో రెండోస్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే తూర్పుగోదావరి జిల్లా మొదటి స్థానంలో ఉంది. కరోనా ప్రారంభ సమయంలో ఈ జిల్లాలో పెద్దగా ప్రభావం లేకున్నా ఆ తరువాత కేసులు విజృంభించాయి.
రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ ఉన్నా కొందరికి లక్షణాలు కనిపించడంతో ఆసుపత్రిల్లో జాయిన్ అయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం లేని కొందరు ప్రైవేట్లో చికిత్స చేయించుకున్నారు. వైరస్ నుంచి కోలుకున్నా ఆర్థికంగా తీవ్ర అప్పుల్లో కూరుకుపోయారు. కరోనా చికిత్సకు 5 నుంచి 20 లక్షల వరకు చేసిన పేదలు, మధ్యతరగతి వారు ఇప్పుడు అప్పులు తీర్చే మార్గం లేక.. ఉపాధి లేక బతికి చెడ్డ వారుగా మిగిలిపోతున్నారు. ఈ పరిస్థితి ఎక్కువగా ఎగువ, మధ్యతరగతి వారికే ఉందని తెలుస్తోంది. సామాన్యులు, కూలీలు వారి పనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. మధ్యతరగతి వారి పరిస్థితి మాత్రం చెప్పలేని పరిస్థితి దాపురించింది.
కరోనా వైరస్ సోకి ఆసుపత్రిలో చికిత్స చేసుకున్నవారికి ఏపీ ప్రభుత్వం రూ. 2వేలు ఇస్తానని తెలిపింది. అలాగే మృతి చెందిన వారికి రూ.15 వేలు అందిస్తామన్న హామీ మరిచింది. తొలుత కరోనా సోకి ఇంట్లో చికిత్స తీసుకుంటున్న వారికి ప్రభుత్వం కిట్లు అందజేసింది. ఆ తరువాత దానిపై శ్రద్ద ఉంచకపోవడంతో బాధితులు ప్రైవేట్లో కొనుగోలు చేసుకున్నారు. దీంతో ఉన్న ఆదాయమంతా మందుల ఖర్చులకే పోయిందంటున్నారు.
అటు ప్రోత్సాహం లేక.. ఇటు ఆదాయంల లేక మధ్యతరగతి జీవుడు ఇప్పటికీ కుమిలిపోతున్నాడు. కరోనా ప్రభావం కొంతకాలమే అనుకున్నా.. ఆర్థికంగా మాత్రం శాశ్వతంగా నష్టపోయే అవకాశముందని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.