ప్రపంచాన్నివణికిస్తున్న యూకే స్ట్రెయిన్ ఇండియాకు వచ్చిందా? అందునా ఏపీలో గుర్తించారా? అన్న సందేహం కోట్లాది మందిని తొలిచేస్తుంది. దీంతో.. అదే పనిగా ఈ ఇష్యూ గురించి మాట్లాడుకోవటం.. దీనిపై పుకార్లు షికార్లు చేయటం ఎక్కువైంది. గడిచిన రెండు రోజులుగా ఏపీ వ్యాప్తంగా.. యూకే స్ట్రెయిన్ మీద అసత్యాలు అంతకంతకూ విస్తరిస్తున్నాయి. దీంతో.. రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. కొత్త స్ట్రెయిన్ మీద క్లారిటీ ఇచ్చేసింది. యూకే నుంచి ఇప్పటివరకు వచ్చిన వారిలో కొత్త స్ట్రెయిన్ ను గుర్తించలేదని స్పష్టంచేశారు.
అనవసరమైన ఆందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని.. వడపోత కార్యక్రమం మొదలైందని.. అంతిమ ఫలితం ఒకట్రెండు రోజుల్లో తేలిపోనుందని చెబుతున్నారు. ఇప్పటివరకు యూకే నుంచి ఏపీకి వచ్చిన వారు 1363 మందిగా గుర్తించారు. వీరిలో 1346 మంది ఆచూకీని గుర్తించారు. మరో 17 మంది అడ్రస్ లను గుర్తించాల్సి ఉంది.
కాగా.. యూకే నుంచి వచ్చినట్లుగా గుర్తించిన వారిలో పదకొండు మందికి పాజిటివ్ గా తేలింది. వీరి శాంపిళ్లను ఫూణెలోని వైరాలజీ ల్యాబ్ ను.. హైదరాబాద్ లోని సీసీఎంబీకి పంపారు. అక్కడ.. ఈ శాంపిల్స్ ను పరీక్షిస్తున్నారు. కొత్త స్ట్రెయిన్ ఏపీకి వచ్చిందా? రాలేదా? అన్నది ఇంకా తేలాల్సి ఉంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మరో రెండు రోజుల వ్యవధిలో ఈ విషయంపై మరింత స్పష్టత రావొచ్చంటున్నారు.
యూకే నుంచి ఏపీకి వచ్చిన 1324 మందిని క్వారంటైన్ చేయటమే కాదు.. వారు కాంటాక్టు అయిన 5784 మందిని గుర్తించి.. వారి బ్లడ్ శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపారు. బ్రిటన్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు తమ వివరాల్ని తప్పనిసరిగా వైద్య ఆరోగ్య శాఖ వెబ్ పోర్టల్ లో నమోదు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. బ్రిటన్ నుంచి ఏపీకి వచ్చిన వారికి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వస్తే.. నేరుగా ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఒకవేళ నెగిటివ్ వస్తే మాత్రం పద్నాలుగు రోజుల పాటు క్వారంటైన్ లో ఉంచాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.