ఏపీలో కరోనా తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వానికి యంత్రాంగం చాలని పరిస్థితి నెలకొంది. రాబోయే రోజుల్లో మరింతగా కోవిడ్ కేసులు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో కరోనాపై ప్రతి ఒక్కరినీ కలిసి.. ప్రబుత్వం ఏం చేస్తోం దో వివరించాలి? ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తలు, వైద్య శాలలపై , మందులపై అవగాహన కల్పించాలి. మరి దీనికి ఎవరు ముం దుకు వస్తారు? అంటే.. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకువచ్చిన వలంటీర్ వ్యవస్థను వినియోగించుకునేందుకు పరిశీలిస్తున్నట్టు తెలిసింది.
దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో జగన్ ప్రభుత్వం వలంటీర్ వ్యవస్థను ప్రజలకు చేరువ చేసింది. దాదాపు గ్రామాల్లో 2.6 లక్షల మంది వలంటీర్లు పనిచేస్తున్నారు. ప్రబుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, పింఛన్ల పంపిణీ వంటివాటిని వలంటీర్లు చేస్తున్నారు. ఈ క్రమంలో వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను కూడా వీరితోనే చేయించి.. 100 శాతం సంపూర్ణంగా అమలు చేయాలని జగన్ ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఈ విషయంపై జగన్ కనుక నిర్ణయం తీసుకుని వ్యాక్సినేషన్ అంశాన్ని ఆయన వలంటీర్లకు అప్పగిస్తే.. దేశంలోనే కాక.. ప్రపంచంలోనే ఈ పని చేసిన డైనమిక్ లీడర్‌గానే కాకుండా.. మోడల్ లీడర్‌గా కూడా ఆయన నిలుస్తారనడంలో సందేహం లేదు.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ కొరత ఏర్పడ్డ విషయం తెలిసిందే. కోవిషీల్డ్, కోవ్యాగ్జిన్ తయారు చేస్తున్న సంస్థలు.. రాష్ట్రాలతో పాటు కేంద్రానికి కూడా ఎప్పటికప్పుడు సరఫరా చేస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న స్టాకును వలంటీర్ వైజ్‌గా డివైడ్ చేసి.. మెడికల్ స్టాఫ్ ద్వారా ప్రతి ఇంటికీ సరఫరా చేసే ఉద్దేశం కనిపిస్తోంది. ప్రతి ఒక్క వలంటీర్ ప్రస్తుతం 50 ఇళ్లను పర్యవేక్షిస్తున్నారు. వీరికి వ్యాక్సిన్ ఇచ్చి మెడికల్ స్టాఫ్‌ను కనుక ప్రొవైడ్ చేస్తే.. జగన్ లక్ష్యం సాకారం అవుతుందని అంటున్నారు.
ఇక, గ్రామ వలంటీర్లను తీసుకుంటే.. వారి వద్ద అర్హులైన ప్రతి ఒక్కరి సమాచారం ఉంటుంది. ఆధార్, మొబైల్ నెంబర్ లు సహా వారి వద్ద ఉన్నాయి. దీనిని యూనిక్ సెంట్రలైజ్డ్ పోర్టల్‌లో ఉంచడం ద్వారా వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని సులభంగా చేరుకోవచ్చని అంటున్నారు. వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత వలంటీర్ సంబంధిత లబ్దిదారుని వివరాలను డోస్ వైజ్‌గా అప్ డేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కొందరు వ్యాక్సిన్ తీసుకుని ఉంటే.. వారి వివరాలను వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ సహా అప్పటికే వ్యాక్సినేషన్ పూర్తయిందనే మార్కును కూడా పోర్టల్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది.
ఈ విధానంలో అనేక లాభాలు..
+ రాష్ట్రంలో అనేక మంది వయో వృద్ధులు ఉన్నారు. వీరు ఇంటి గడప దాటి బయటకు వచ్చే పరిస్థితి లేదు. అదేసమయంలో ఆసుపత్రి వరకు వెళ్లే అవకాశం కూడా లేదు. వీరిలో కొందరు మోకాళ్ల నొప్పులతో సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరికొందరు ఇతర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీరికి వలంటీర్ సేవలు అందివస్తాయి.
+ వలంటీర్లను రంగంలోకి దింపితే.. వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరందుకుంటుంది. అదేసమయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగిపోతుంది.
+ కేంద్రం తీసుకువచ్చిన కోవిన్ యాప్‌లో తమ వివరాలను నమోదు చేసుకునే అవకాశం లేదు. నిరక్షరాస్యులకు ఈ సమస్య ఎక్కువ. సో.. ఇలాంటివారికి కూడా వలంటీర్ సేవలు ఎంతగానో తోడ్పడతాయి.
+ అదేసమయంలో ఇంటింటి వ్యాక్సిన్ పంపిణీ చేయడం వల్ల ప్రజలకు, ప్రబుత్వానికి మధ్య మరింతగా అనుబంధం పెరుగుతుంది. మెజారిటీ ప్రజలు.. నేతల సేవకు హర్షం వ్యక్తం చేస్తారనడంలో సందేహం లేదు. తమ ఆరోగ్యాన్ని ఇంతగా పర్యవేక్షిస్తున్న ప్రభుత్వానికి వారు ఖచ్చితంగా కృతజ్ఞత చూపుతారు. డోర్-టు-డోర్ వ్యాక్సిన్ పంపిణీని మించిన కార్యక్రమం మరొకటి ఉండదని అంటున్నారు.
+ ఈ నేపథ్యంలో ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని తక్షణమే అమలు చేస్తారని భావిస్తున్నారు.