దేశ ప్రజలకు కరోనా వ్యాక్సిన్ వేసేందుకు కొద్ది రోజులుగా సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టీకా వేయాల్సిన విధానంపై పట్టణ, గ్రామ స్థాయిలో వైద్య సిబ్బందికి శిక్షణ, అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేసింది. శనివారం దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ డ్రైరన్ ప్రారంభం అయ్యింది. కేంద్ర ఆరోగ్య వైద్య శాఖ ఆధ్వర్యంలో నేడు డమ్మీ వ్యాక్సిన్లు వేసే కార్యక్రమం చేపట్టారు. మరి కొద్ది రోజుల్లో ప్రజలకు కరోనా వ్యాక్సిన్లు వేయనుండడంతో అందుకు సన్నద్ధం కావడానికి, టీకా పంపిణీలో తలెత్తే లోపాలను అధిగమించడానికి ఈ డమ్మీ వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టారు.
కేంద్ర నిపుణుల కమిటీ ఇప్పటికే సీరం – ఆక్స్ ఫర్డ్ తయారు చేసిన కొవిషీల్డ్ ను భారత్ లో అత్యవసర వినియోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో వారం పది రోజుల్లో ఒరిజినల్ వ్యాక్సిన్ పంపిణీ కూడా ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీకా పంపిణీలో ఎటువంటి సమస్యలు ఎదురవుతాయి, వ్యాక్సిన్ల తరలింపు ఎలా చేపట్టాలి, వ్యాక్సినేషన్లో ఇబ్బందులు ఎదురైతే ఎలా ఎదుర్కోవాలి, అలాగే ఒరిజినల్ టీకా పంపిణీ కల్లా వైద్య సిబ్బందికి వ్యాక్సినేషన్ పంపిణీలో తగిన అవగాహన పెంచుకోవడం కోవడం కోసం డమ్మీ డ్రైరన్ చేపట్టినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలోని పలు ముఖ్య పట్టణాల్లో మూడు మూడు కేంద్రాల చొప్పున వ్యాక్సిన్ పంపిణీ చేపట్టారు.
మహారాష్ట్ర, కేరళ వంటి పలు రాష్ట్రాల్లో జిల్లా కేంద్రాలకు సరైన కనెక్టివిటీ లేనందున రాజధాని నగరాలు, ఇతర ముఖ్య ప్రాంతాల్లోనే డ్రైరన్ మొదలు పెట్టారు. ఈ రోజు జరిగే కార్యక్రమంలో ప్రతి కేంద్రంలో 25 మంది కార్యకర్తలకు డ్రైరన్ వ్యాక్సిన్ వేస్తారు. వ్యాక్సిన్ పంపిణీ కోసం తయారు చేసిన కోవిన్ యాప్ లో టీకా వేయించుకున్న ఆరోగ్య కార్యకర్తల వివరాలు పొందుపరచనున్నారు. మనది భారీ జనాభా ఉన్న దేశం కావడంతో వ్యాక్సిన్ పంపిణీకి కూడా వైద్య సిబ్బంది కూడా భారీగానే అవసరమవుతారు.
ఒక్కసారి వ్యాక్సిన్ పంపిణీ మొదలైందంటే వారి పాత్ర ఎంతో కీలకం. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం 96 వేల మంది ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. డ్రై రన్ కోసం 85 కోట్ల సిరంజీలను కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. ఆస్ట్రాజెనేకా, ఆక్స్ ఫర్డ్ వర్సిటీ చేసిన కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ కు భారత్లో వినియోగానికి గురువారం సిగ్నల్ వచ్చింది. భారత్ బయోటెక్ సిద్ధం చేస్తున్న కొవాగ్జిన్ కూడా త్వరలోనే అనుమతి లభించనున్నట్టు తెలిసింది. ఈ రెండు లక్షల పంపిణీ కార్యక్రమం వారం పది రోజుల్లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.