పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులతో పాటు పాత్రికేయులు కూడా అత్యవసర సేవలు అందిస్తున్నారు. లాక్‌డౌన్ సమయంలోనూ ప్రజలకు నిరంతరం వార్తలు అందించడంలో మునిగిపోయారు. వైరస్ తీవ్రంగా వ్యాపిస్తున్న క్రమంలో కూడా మీడియాకు చెందిన ఉద్యోగులు తమ విధులు నిర్వహిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో జర్నలిస్టులు కూడా వైరస్ బారిన పడుతున్నారు. దేశవ్యాప్తంగా జర్నలిస్టులు పెద్ద ఎత్తున వైరస్ బారిన పడగా తెలుగు రాష్ట్రాల్లో కొందరికే వైరస్ సోకింది. ఇప్పుడు తాజాగా తెలుగులో ప్రధాన పత్రిక అయిన సాక్షిలో వైరస్ కలకలం రేపుతోంది. తాజాగా ఓ రిపోర్టర్ కు పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఆశ్చర్యమేమంటే ఆయన తెలంగాణ లో వైరస్ వార్తల బీట్ చూస్తున్నాడు. చివరకు ఆయన అదే వైరస్ బారిన పడడం గమనార్హం. ఆయనతో పాటు ఆయన భార్యకు కూడా పాజిటివ్ అని తేలింది.
తమ ఉద్యోగికి పాజిటివ్ నిర్ధారణ కావడంతో సాక్షిలో కలకలం రేపుతోంది. హైదరాబాద్‌లోని సాక్షి ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వహిస్తుండడంతో ఉద్యోగులంతా భయాందోళన చెందుతున్నారు. ఈ విషయం తెలియగానే సాక్షి యాజమాన్యం అప్రమత్తమైంది. వెంటనే కార్యాలయం మొత్తాన్ని శానిటైజ్ చేయించారు. కార్యాలయంలో బుధవారమంతా ఈ విషయమై ఆందోళన రేపింది. ప్రత్యేకంగా డీ ఇన్‌ఫెక్షన్ యంత్రాన్ని తీసుకొచ్చి ఉద్యోగులందర్నీ దాని ద్వారా నాలుగైదు సార్లు నడిపించారు. ఈ సందర్భంగా వైరస్ నియంత్రణ చర్యలు చేపట్టారు. లిఫ్టుల వాడకాన్ని నిలిపివేశారు. కార్యాలయంలోని ఐదో అంతస్తులో కీలకమైన రిపోర్టింగ్ .. డెస్క్‌లు కొనసాగుతాయి. అదే అంతస్తులో విధులు నిర్వహించే రిపోర్టర్‌కు పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. నాలుగు, ఐదు, ఆరు అంతస్తుల్లోని ఉద్యోగులకు వైరస్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం.