కరోనా పేరుతో పుట్టింటికి పంపి భర్త జంప్

Update: 2020-06-17 09:10 GMT
షాకింగ్ ఉదంతం ఒకటి బయటకు వచ్చింది. హైదరాబాద్ లోని నారాయణగూడలో చోటు చేసుకున్న ఈ ఉదంతం గురించి విన్నోళ్లంతా అవాక్కు అవుతున్నారు. ఇలాంటి చావు తెలివితేటలు కూడా ఉంటాయా? అని ఆశ్చర్యపోతున్నారు. వణికించే మహమ్మారి పేరు చెప్పి భార్యను మోసం చేసిన భర్త ప్లాన్ చూస్తే..

ముషీరాబాద్ కు చెందిన వీణను నారాయణగూడకుచెందిన మహేందర్ ఎనిమిదేళ్ల క్రితం పెళ్లాడారు. వారికో పాప ఉంది. వారి మధ్య ఎలాంటి గొడవలు లేవు. చక్కగా సాగుతున్న సంసారంలో ఏమైందో ఏమో కానీ .. తమ బంధువుల ఇంట్లో శుభకార్యం ఉందని.. తానొక్కడినే వెళతానని చెప్పాడు. ఎందుకంటే.. కరోనా ఉందని.. జాగ్రత్తగా ఉండాలని చెబుతూ.. పుట్టింటికి పంపాడు. భర్త మాటల్ని నమ్మిన భార్య సరేనంది.

అలా వెళ్లిన భర్త వారం దాటినా రాకపోవటం.. అతడి ఫోన్ స్విచ్ఛాప్ చేసి ఉండటంతో ఆమెకు అర్థం కాలేదు. ఏం జరిగిందో అన్న ఆందోళనతో ఇంటికి వెళ్లిన ఆమెకు షాకింగ్ విషయం తెలిసింది. అప్పటికే ఆమె భర్త ఇంటిని ఖాళీ చేశారని చెప్పారు. కిటికీలో నుంచి చూస్తే.. ఇంట్లో ఏమీ కనిపించలేదు. దీంతో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన ఆమె.. తనకు న్యాయం చేయాలని కోరుతోంది.  పోలీసులు తలుచుకుంటే తన భర్త ఎక్కడకు వెళ్లారో కనుక్కోవటం పెద్ద కష్టం కాదంటున్న ఆమె.. తన భర్త జాడ చెప్పాలని వేడుకుంటోంది. మరి.. పోలీసులు ఏం చేస్తారో?
Tags:    

Similar News