దర్శకరత్న, ఇండియన్ సినిమా లెజండ్ దాసరి నారాయణరావు మృతి సినీ పరిశ్రమను శోకసంద్రంలో ముంచింది. కేవలం సినిమా ప్రముఖులే కాకుండా రాజకీయ - సామాజికవేత్తలు - సామాన్యులు సైతం ఎందరో దాసరి మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దాసరిని చివరి చూపు చూసి తమతో ఆయనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ ఆర్ సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
దాసరి పార్థివ దేహాన్ని సందర్శించిన సందర్భంగా భూమన మీడియాతో మాట్లాడుతూ దాసరి మరణం తీరనిలోటు అని వ్యాఖ్యానించారు. అనేక అద్భుతమైన చిత్రాలకు దాసరి దర్శకత్వం వహించారని చెప్పారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ పట్ల ప్రత్యేక అనుబంధం ఉందని తెలిపారు. వైసీపీలో చేరి వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేస్తానని ఇటీవల దాసరి తనతో తెలిపారని భూమన ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. కాగా, కొద్దికాలం దాసరితో వైఎస్ జగన్ భేటీ అయిన సందర్భంగా జగన్ తన కొడుకు లాంటి వాడని దర్శకరత్న తెలిపారు.
ఇదిలాఉండగా... దాసరి నారాయణరావు మృతి పట్ల వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంతాపం తెలిపిన వైఎస్ జగన్... దాసరి నారాయణ రావు కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. దాసరి నారాయణ రావు మరణం తెలుగు సినీరంగానికి తీరని లోటని వైయస్ జగన్ అన్నారు. దశాబ్ధాలుగా సినీరంగానికి ఆయన పెద్ద దిక్కుగా ఉన్నారని కొనియాడారు. 150కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించడమే గాకుండా, బహుముఖ ప్రజ్ఞాశాలి, నటుడు, రచయిత, ప్రయోక్త, సామాజిక ఉద్యమకారుడు, పత్రికాధిపతి, మంచి మనిషిగా దాసరి నారాయణ రావు ఎప్పటికీ చిరస్మరణీయుడని పేర్కొన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/