బీజేపీ ఎన్నికల ప్రచార చైర్మన్ హోదాలో దేశ వ్యాప్తంగా ప్రకటిస్తూ నప్రస్తుత ప్రధాని, అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి చేసిన హామీల్లో ప్రధానమైనది నల్లధనాన్ని వెనక్కి తెప్పించడం...అర్హుల ఖాతాలో రూ.15 లక్షలు డిపాజిట్ చేయడం. ఈ ప్రకటన బీజేపీ వైపు అనేక మంది చూసేలా ఆసక్తిని పెంచింది. అదే రీతిలో బీజేపీ నేతల్లో ఉత్సాహాన్ని నింపింది. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ మొత్తాన్ని వేస్తుందని బీజేపీ నేతలు కూడా వివరించారు. అయితే మోడీ అధికారంలోకి రావడం...నాలుగేళ్లు గడిచిపోవడం కూడా అయింది.. అయితే దానికి అతీగతి లేని పరిస్థితి. ఈ నేపథ్యంలో మోడీ ఇచ్చిన కీలక సమాచారంపై ఆసక్తికరమైన స్పందన వచ్చింది.
2014 లోక్‌సభ ఎన్నికల ప్రచార సందర్భంగా, విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని భారత్‌కు తీసుకొచ్చి ప్రతి ఒక్కరి బ్యాక్ ఖాతాలో రూ.15 లక్షల చొప్పున డిపాజిట్ చేస్తామని ప్రధాని మోడీ వాగ్దానం చేసిన సంగతి ఏమయిందనే విషయం ఏమయిందని, ఆ డబ్బును ఏ తేదీన జమచేయనున్నారో తెలుపాలని కోరుతూ ఆర్టీఐ కింద మోహన్‌కుమార్ శర్మ అనే వ్యక్తి దరఖాస్తు చేసుకున్నాడు. ప్రధాని నరేంద్రమోడీ వాగ్దానానికి సంబంధించి సమాచార హక్కు చట్టం కింద అడిగిన ఒక ప్రశ్నకు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) సమాధానం ఇవ్వలేదు. కచ్చితంగా ఏ తేదీన తమ ఖాతాలో డబ్బు జమ చేస్తారో తెలియజేయాలని దరఖాస్తుదారుడు కోరారు. 2016 నవంబరు 26న సంధించిన ఈ ప్రశ్నకు ప్రధానమంత్రి కార్యాలయం తాజాగా జవాబిచ్చింది. సమాచార హక్కు చట్టంలోని నిబంధనల ప్రకారం ఈ ప్రశ్నను పరిగణనలోకి తీసుకోలేమని పీఎంవో పేర్కొంది. దేశంలో ప్రతి పౌరుని బ్యాంక్ ఖాతాలో రూ.15 లక్షలు డిపాజిట్ చేస్తానని సాక్షాత్తు ప్రదాని ఇచ్చిన హామీకే ఆచరణ చరూపం లేకపోతే ఇక మిగతా నేతల సంగతి ఏమిటని మోహన్‌కుమార్ శకర్మ ఆవేదన వ్యక్తం చేశారు.