77ఏళ్ల వయసులో అమ్మాయి కోసం ఆశపడి..

Update: 2021-07-22 01:30 GMT
ఆయనకు 77 ఏళ్లు.. హైదరాబాద్ నగరంలో నివసిస్తున్న వృద్ధుడు. కాటికి కాలు చాపే వయసు.. కృష్ణా రామా అంటూ సేదతీరకుండా పోరీల కోసం ఆశపడ్డాడు.. సొల్లు కార్చాడు. అదే అతడి పాలిట శాపమైంది.

హైదరాబాద్ నగరంలో నివసిస్తున్న 77 ఏళ్ల వృద్ధుడిని సైబర్ మోసగాళ్లు ప్రేమ పేరుతో ముగ్గులోకి దింపారు. ప్రేమ, డేటింగ్, చాటింగ్ అంటూ వృద్ధుడితో కబుర్లు ఆడారు. అంత లేటు వయసులో తనకు అమ్మాయి దొరుకుతుందని ఎంజాయ్ చేయవచ్చని వృద్ధుడికి ఆశ పుట్టింది. మరోసారి యవ్వనపు రోజులు మదిలో మెదిలాయి.

ఈ నేపథ్యంలో డేటింగ్ పేరుతో మోసగించి ఆ వృద్ధుడి నుంచి రూ.11 లక్షలు మోసగాళ్లు వసూళ్లు చేశారు.మరింత మొత్తాన్ని అడగడంతో తాను మోసపోయానని గమనించిన వృద్ధుడు హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.తన అన్యాయం జరిగిందని బోరుమన్నాడు.

లేటు వయసులో ఘాటు ప్రేమ దొరకుతుందని ఆశించిన ఆ వృద్ధుడు నిండా మునిగిపోయాడు. డబ్బులు పోయి లక్షల్లో కోల్పోయి బావురు మన్నాడు. తనకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకున్నాడు.
Tags:    

Similar News