ఎమ్మెల్యే కి 39 .. వధువుకి 19 .. లవ్ మ్యారేజ్ .. తండ్రి ఆత్మహత్యాయత్నం !
ఈ సమాజంలో ప్రేమ పెళ్లిళ్లు సర్వసాధారణమే అయినప్పటికీ ప్రజా ప్రతినిధులు ప్రేమ వివాహాలు చేసుకోవడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఎందుకంటే ఎంపీలు, ఎమ్మెల్యేల్లో యువకులు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. అయితే , తమిళనాడులో అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే కాలేజీ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . దళిత సామాజికవర్గానికి చెందిన ఈ ఎమ్మెల్యే బ్రహ్మణ యువతిని వివాహం చేసుకున్నారు. ఎమ్మెల్యేకి 39 ఏళ్లు కాగా, పెళ్లి కుమార్తెకు 19 ఏళ్లు.పూర్తీ వివరాల్లోకి వెళ్తే .. కల్లకూరిచి ఎమ్మెల్యే ప్రభు సౌందర్య అనే యువతి ప్రేమలో పడ్డారు. ప్రేమించిన సౌందర్యను సోమవారం ప్రభు వివాహం చేసుకున్నారు. తియకతురుగంలోని ఎమ్మెల్యే ప్రభు ఇంటిలోనే పెళ్లి జరిగింది. ఎమ్మెల్యే ప్రభు తల్లిదండ్రులు, సమీప బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఆయన వివాహం నిరాడంబరంగా జరిగింది. అయితే ఈ పెళ్లి సౌందర్య కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు. అందుకే వారెవరూ వివాహానికి హాజరుకాలేదు. త్యాగదుర్గం మలైకొటే గ్రామానికి చెందిన సౌందర్య ప్రస్తుతం బీఏ ఇంగ్లీష్ సెకండియర్ చదవుతోంది. సౌందర్య తండ్రి అర్చకుడిగా సేవలందిస్తున్నారు.
మరోవైపు ఎమ్మెల్యే తన కుమార్తెను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని సౌందర్య తండ్రి స్వామినాథన్ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసాడు. ఇద్దరి వయసు 20 ఏళ్లు తేడా ఉందన్న ఆయన ..పెళ్లికి ఒప్పుకోకపోతే మమ్మల్ని చంపేస్తామని ఎమ్మెల్యే బెదిరించాడని ఆరోపించాడు.సౌందర్య వయసు ప్రస్తుతం 19 ఏళ్లని.. కానీ తన కుమార్తెను 10 ఏళ్లుగా ప్రేమిస్తున్నానని ఎమ్మెల్యే ప్రభు మీడియాకు అబద్ధాలు చెబుతున్నాడని స్వామినాథ్ ఆరోపణలు చేస్తున్నాడు. అంటే తన కుమార్తెకు 9 ఏళ్లు వయసు ఉన్నప్పటి నుంచి ప్రేమిస్తున్నాడా అది సాధ్యమేనా అని మండిపడుతున్నాడు. ఎమ్మెల్యే ప్రేమ పెళ్లి చేసుకోవడం , పెళ్లి కూతురి తండ్రి ఆత్మహత్యాయత్నం చేయడంతో ఈ పెళ్లి ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.