ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తాజాగా మూడో విడత పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాయి. ఈసారి మెజార్టీ స్థానాలను వైసీపీ గెలుచుకుంది.. అయితే మూడో విడతలో పలువురు ప్రజా ప్రతినిధుల కుటుంబ సభ్యులు కూడా పంచాయతీ బరిలోకి దిగి పలుచోట్ల విజయం సాధించారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి తల్లి రాఘవ సర్పంచ్ గా గెలుపొందారు. అడ్డతీగల మండలం గొండోలు పంచాయతీకి బుధవారం జరిగిన ఎన్నికల్లో సర్పంచ్ పదవికి వైఎస్సార్‌సీపీ మద్దతుతో పోటీచేసిన రాఘవ 273 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
ఆమె 2001–06, 2013–18 వరకు రెండుసార్లు సర్పంచ్ గా పనిచేశారు. ఎమ్మెల్యే స్వగ్రామం రాజుంపాలెం.. గొండోలు పంచాయతీలో ఉంది. ఇక్కడ 1,070 ఓట్లు ఉండగా ఎన్నికల్లో 717 పోలయ్యాయి. మొత్తం ఎనిమిది వార్డుల్లోనూ వైసీపీ మద్దతుదారులే గెలుపొందారు. అలాగే , అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సతీమణి వాణి సర్పంచ్ గా గెలుపొందారు. స్పీకర్ తమ్మినేని స్వగ్రామమైన శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం తొగరాం పంచాయతీ ఎన్నికల్లో తమ్మినేని వాణి భారీ మెజార్టీతో విజయంసాధించారు. గ్రామంలో మొత్తం 1,118 ఓట్లు పోల్ కాగా, వాణికి 808 ఓట్లు సాధించారు. అంటే, తమ్మినేని వాణి భారీ స్థాయిలో 72.22 శాతం ఓట్లు పొందారు. దీంతో మొత్తంగా 510 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.