భారత్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదు. తన మాఫియా సామ్రాజ్యంతో ముంబై పోలీసులను గడగడలాడించిన ఈ నొటోరియస్ గ్యాంగ్ స్టర్ కు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది. బాలీవుడ్ లోని పలువురు సినీతారలు,సెలబ్రిటీలతో పాటు వ్యాపారస్థులందరూ దావూద్ బాధితులే. 1993 ముంబై పేలుళ్లతో భారత్ లో మారణహోమం రేపిన దావూద్...దాయాది దేశం పాకిస్థాన్ లో తలదాచుకొని తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నాడు. కొంతకాలంగా దావూద్ అనారోగ్యానికి గురయ్యాడని, అందువల్లే కొన్ని షరతుల ప్రకారం భారత ప్రభుత్వానికి లొంగిపోబోతున్నాడని వార్తలు కూడా వచ్చిన సంగతి విదితమే. అంతేకాదు, లొంగుబాటు గురించి బీజేపీ సర్కార్ తో దావూద్ సంప్రదింపులు కూడా జరిపాడని వదంతులు వినిపించాయి. ఈ నేపథ్యంలో, తాజాగా దావూద్ ఇబ్రహీంకు సీబీఐ భారీ షాక్ ఇచ్చింది. దావూద్ ప్రధాన అనుచరుడు - డీ గ్యాంగ్ లో కీలకమైన సభ్యుడు ఫరూఖ్ టక్లాను సీబీఐ అధికారులు దుబాయ్ లో అరెస్టు చేశారు. 1993 ముంబై పేలుళ్ల నిందితుడైన టక్లాను సీబీఐ అధికారులు వల పన్ని పట్టుకున్నారు.
1993 మార్చి 12వ తేదీన ముంబైలో డీ గ్యాంగ్ జరిపిన మారణహోమంలో 257 మంది అశువులు బాయగా, 720 మందికి పైగా తీవ్రగాయాల పాలయ్యారు. ఆ దాడుల తర్వా దావూద్, టక్లా లు దుబాయ్ కి పారిపోయారు. దీంతో, వారిద్దరినీ అమెరికా ఇంటర్ పోల్.....మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చింది. అప్పటినుంచి ఇంటర్ పోల్, సీబీఐ లు దావూద్, టక్లా కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. తాజాగా, దుబాయ్ లోని ఓ రహస్య ప్రాంతంలో టక్లా నక్కాడని పక్కా సమాచారం అందుకున్న సీబీఐ అధికారులు అతడి కోసం మాటు వేశారు. బుధవారం దుబాయ్ చేరుకున్న సీబీఐ అధికారులు పక్కా ప్రణాళికతో టక్లాను అరెస్టు చేశారు. టక్లాను గురువారం (మార్చి 8వ తేదీ) భారత్ కు తీసుకురాబోతున్నారు. టక్లాను ముంబైలోని టాడా కోర్టులో హాజరుపరిచి న్యాయమూర్తి అనుమతితో అదుపులోకి తీసుకుని విచారణ చెయ్యాలని సీబీఐ అధికారులు నిర్ణయించారు. దావూద్ కు కుడి భుజమైన టక్లా అరెస్టుతో డీ గ్యాంగ్ కు కోలుకోలేని దెబ్బ తగిలిందని సీబీఐ అధికారులు చెబుతున్నారు.