ముఖ్యమంత్రిపై మంత్ర ప్రయోగం?

Update: 2016-12-30 08:01 GMT
   
లోకం ఎంతగా అడ్వాన్సు అవుతున్నా నమ్మకాలు - భయాల నీడ నుంచి మాత్రం మనిషి బయటకు రాలేకపోతున్నాడు. సాధారణ వ్యక్తులైనా.. సైన్సు గురించి అంతా తెలిసినవారైనా సమయమొచ్చేసరికి లాజిక్ కంటే పరిస్థితులకే ప్రయారిటీ ఇస్తారు.  మూఢ నమ్మకాలు పారదోలాలి అంటూ సమాజానికి చెప్పేవారు కూడా తమ వరకు వచ్చేసరికి టెన్షన్ పడతారు. తాజాగా దేశంలోని ఓ ముఖ్యమంత్రే  ఏకంగా మంత్రాల గురించి బయపడుతున్నారు. తన చెడు కోసం ఎవరో క్షుద్రపూజలు చేస్తున్నారంటూ కంగారు పడుతున్నారు.
    
కాశ్మీర్ ముఖ్య‌మంత్రి మొహ‌బూబా ముప్తీకి కొద్దిరోజులుగా టైం బాగులేదు.   ఆమె తండ్రి ముఫ్తీ మహ్మద్ సయ్యద్  ఈ ఏడాది ప్రారంభంలో మరణించారు. ఆ తరువాత అక్కడ కొద్దికాలం రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. తండ్రిపోయిన ఆవేదనలో ఉన్న ఆమె ఆ తరువాత రాష్ర్ట పగ్గాలు చేపట్టారు. అదంతా ఎలా ఉన్నా ఇటీవల పరిణామాలు ఆమెను టెన్షన్ పెడుతున్నాయట.  మెహబూబా ఇంటి పెర‌టిలో ఇటీవ‌ల వ‌రుస‌గా నాలుగైదురోజుల‌పాటు కాకులు చ‌చ్చిప‌డి ఉంటున్నాయి. ఇది త‌న ఇంటి చుట్టూపెట్టిన విద్యుత్ కంచె షాక్ వ‌ల్ల కాకులు మృతిచెందుతున్నాయేమోని అనుకున్నారు. కాని అది నిజం కాద‌ని విచార‌ణ‌లో తేలింది. కార‌ణం తెలుసుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఎవ‌రైనా వాటికి విషం పెట్టి చంపుతున్నారా? అనే అనుమానం కూడా వ‌చ్చింది. ముఖ్య‌మంత్రి మీద కుట్ర‌తో ఇలా చేస్తున్నారా అనే సందేహం కూడా వ‌చ్చింది. చివ‌రికి పెర‌టిలో చ‌నిపోయే కాకుల చావు చెడు శ‌కునం అన్న నిర్ణ‌యానికి మ‌హిళా సి.ఎం. వ‌చ్చారు. ఎవ‌రో త‌న‌మీద  ఏదో మంత్ర‌ప్ర‌యోగం చేస్తున్నార‌న్న భయం ఆమెకు కలుగుతోందట.
    
కాగా ఇదే సమయంలో  అధికారం పంచుకుంటున్న బిజెపితో విబేధాలు పొడ‌చూపాయి. దానికి త‌న ఇంటిలోని కాకుల‌ చావు కార‌ణంగానే ఇదంతా జ‌రుగుతుంద‌ని ఆమె దిగులు చెందుతున్నారట. ఇది ఎంతవరకు దారి తీస్తుందో అని ఆందోళన చెందుతున్నారట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/

Tags:    

Similar News