దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తుకు సంబంధించి సీబీఐకి సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు జూన్ 30తో ముగియనుంది. జూన్ 30 నాటికి వివేకా హత్య కేసును తేల్చాలని సుప్రీంకోర్టు సీబీఐకి గడువు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇంతవరకు దర్యాప్తు కొలిక్కి రాలేదు. దీంతో సీబీఐ ఏ నిర్ణయం తీసుకోనుంది? సుప్రీంకోర్టు ఏం చేయనుందనే అనే అంశాలపై ఉత్కంఠ నెలకొంది.
మరోవైపు ఈ కేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు కోరుతూ వివేకా కుమార్తె సునీత వేసిన పిటిషన్ పై జులై 3న సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా జులై 3న సుప్రీంకోర్టుకు కేసు దర్యాప్తు పురోగతిని సీబీఐ వివరించి సమయం కోరే అవకాశముందని తెలుస్తోంది. విచారణను పూర్తి చేసేందుకు తమకు మరింత గడువు నివ్వాలని సీబీఐ అభ్యర్థించే అవకాశముంది.
మరోవైపు జూన్ 30న హైదరాబాద్ లోని సీబీఐ కోర్టులో వివేకా హత్య కేసుపై విచారణ జరిగింది. నిందితులు భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, ఉదయ్‌కుమార్ రెడ్డిలను చంచల్ గూడ జైలు నుంచి సీబీఐ కోర్టుకు తరలించారు. నిందితుల రిమాండ్ గడువు ముగియడంతో వారిని న్యాయస్థానంలో హాజరుపరిచారు.
ఈ నేపథ్యంలో నిందితుల రిమాండ్ ను సీబీఐ కోర్టు పొడిగించింది. ఆరుగురు నిందితులు ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిల రిమాండ్‌ను జులై 14 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు ఈ కేసుకు సంబంధించి అనుబంధ చార్జిషీట్ ను కోర్టులో సీబీఐ దాఖలు చేసింది. ఇప్పటికే రెండు చార్జిషీట్లు దాఖలు చేయగా.. ఇది మూడోది. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డిపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. 2021లో తొలి చార్జిషీట్, 2022 జనవరిలో సప్లిమెంటరీ చార్జిషీట్, ఇప్పుడు తాజాగా జూన్ 30న మూడో చార్జిషీట్ దాఖలు చేసింది.