బీజపీ భయపడొద్దంటున్న యువరాజు

Update: 2017-01-18 07:24 GMT
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాహుల్ గాంధీ చేసిన ఒక వ్యాఖ్యను పట్టుకొని బీజేపీ నేతలు లేవనెత్తిన ఒక అంశంపై ఆయన కాస్తంత వ్యంగ్యంగా ట్వీట్ చేసిన వైనం పలువురి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇటీవల జరిగిన ఒక సమావేశంలో కాంగ్రెస్ పార్టీ గుర్తు అయిన హస్తం.. దేవుళ్లలో.. అధ్యాత్మిక గురువుల్లో కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ గుర్తు అయిన హస్తాన్ని రద్దు చేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని పలువురు బీజేపీ నేతలు కోరుతున్నారు. ఈ వివాదం ఇలా ఉంటే..ఈ వ్యవహారంపై తాజాగా రాహుల్ స్పందించారు. ‘‘డియర్ బీజేపీ.. డరోమత్’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. ప్రియమైన బీజేపీ.. భయపడొద్దన్నది రాహుల్ ట్వీట్ సారాంశంగా చెప్పాలి. మరి.. దీనికి బీజేపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News