బాగా పెద్దగా ఉండే పురుషాంగాన్ని చూస్తే దెయ్యాలు ఉ. పోసుకుంటాయట. థాయిలాండ్‌లోని ‘న చియూక్ యాయ్’ అనే ఊళ్లో ప్రజలు చెప్తున్న మాటిది. రీసెంటుగా అక్కడ అయిదుగురు గ్రామస్థులు మరణించడంతో దానికి కారణం దెయ్యాలేనని వారు నమ్ముతున్నారు. దీంతో దెయ్యాన్ని భయపెట్టడానికి ఏం చేయాలా అని ఆలోచించారు. మంత్రగాళ్లను కలిస్తే వారొక ఐడియా ఇచ్చారు. భారీ పురుషాంగం ఉంటే దెయ్యం భయపడుతుందని చెప్పారట. కానీ.. అంత పెద్ద పురుషాంగం ఎవరికి ఉంటుంది? అందుకే పెద్దపెద్ద పురుషాంగాలున్న దిష్టి బొమ్మలను తయారుచేసి ఇళ్ల ముందు పెడుతున్నారు. దీంతో ఆ ఊళ్లో ఏ ఇంటి ముందు చూసినా ఆ బొమ్మలే దర్శనమిస్తున్నాయి.
అంతేకాదు.. దయ్యం మగాళ్లపై పగబట్టిందని జనం భయపడుతూ రాత్రయితే చాలు మగాళ్లంతా నైటీలు వేసుకుంటున్నారట. ‘ఈ ఇంట్లో మగాళ్లెవరూ లేరు’’ అన్న బోర్డులు కూడా ఇంటిముందు పెడుతున్నారట.
ఇంతగా భయపడుతున్న జనం అందుకు ఒక కథ కూడా చెప్తున్నారు. కొన్నాళ్ల క్రితం ఓ భర్త లేని మహిళ మృతి చెందిందని.. అప్పటినుంచి ఆమె గ్రామంలోని పురుషులను పట్టి పీడిస్తోందని వారు మూఢ నమ్మకం పెంచుకున్నారు. రాత్రివేళ ఇంట్లో నిద్రిస్తున్న పురుషుల శరీరాల్లోకి ప్రవేశించి.. నిద్రలోనే వారిని చంపేస్తోందంటూ వారు భయపడుతున్నారు.
కేవలం 90మంది మాత్రమే ఉండే ఈ గ్రామంలో.. రాత్రయిందంటే చాలు పురుషులను భయం వెంటాడుతుందట. దెయ్యాల బారి నుంచి రక్షించుకోవడానికి రాత్రవగానే.. నైటీలు వేసుకుని, లిప్ స్టిక్స్ పెట్టుకుని అచ్చు ఆడవాళ్లలా తయారవుతున్నారట. ఇంటి ముందు దిష్టిబొమ్మల్ని పెట్టాకే.. తమ గ్రామంలో పురుషుల మరణాలు ఆగిపోయాయని అక్కడివారు చెబుతున్నారు. తమ ప్రయత్నం ఫలించిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.అయితే.. హేతువాదులు మాత్రం ఇదంతా మూఢనమ్మకాలని.. వ్యాధులకు సకాలంలో చికిత్స అందక గ్రామస్థులు కొందరు చనిపోతే ఇలాంటి ప్రచారం చేస్తూ మూఢ నమ్మకాలతో ఇవన్నీ చేస్తున్నారని అంటున్నారు.