‘ట్విట్టర్ కిల్లర్’కు మరణ శిక్ష.. కిక్కిరిసిన కోర్టు

Update: 2020-12-16 04:30 GMT
ఒక మహిళతోపాటు 9మందిని కిరాతకంగా హతమార్చిన ‘ట్విట్టర్ కిల్లర్’ కు తగిన శిక్ష పడింది. జపాన్ దేశంలో పేరు మోసిన  ట్విట్టర్ కిల్లర్ ‘టకహిరో’కు ఎట్టకేలకు టోక్యో కోర్టు మరణ శిక్ష విధించింది. ఈ శిక్ష అతడికి తక్కువేనని అభిప్రాయపడింది.

జపాన్ దేశంలో టకహిరో అనే 30 ఏళ్ల యువకుడు ట్విట్టర్ ద్వారా పరిచయం చేసుకునో లేదా తనకు పరిచయమైనవారినో టార్గెట్లుగా చేసుకుని వారిని అంతమొందిస్తూ వచ్చాడు. సైకోలా మారాడు. చంపేసిన తర్వాత వారి ముఖాలను చెక్కివేయడం.. శరీర భాగాలను బాక్సుల్లో పెట్టి భద్రపరచడం వంటి అమానుషాలకు టకహిరో పాల్పడేవాడు.

టకహిరో 15 ఏళ్ల నుంచి 26 ఏళ్ల మధ్య వయసుగల వారిని బలిపశువులుగా చేశాడు. ఇతడి అమానుషాలపై ప్రజలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. కోర్టు తీర్పును ఆలకించడానికి బయట పెద్ద ఎత్తున గుమిగూడారు. కోర్టు ఉరిశిక్ష వేయడంతో సంబరాలు చేసుకున్నారు.

ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారికి తాను సహాయపడుతానని టకహిరో నమ్మించేవాడు.. తాను కూడా చేసుకుంటానంటూ వారితో మాట కలిపేవాడు. అనంతరం తన అపార్ట్ మెంట్ కు వారిని రప్పించి అంతమొందించి వారి శరీరభాగాలను కట్ చేసి డీప్ ఫ్రిజ్ లో భద్రపరిచేవాడు.

ఓ యువతి మిస్సింగ్ కేసులో దర్యాప్తు చేసిన పోలీసులు ‘టకహిరో’ను అనుమానించి అరెస్ట్ చేసి ఇంటిని చూడగా దాదాపు 9 మంది మృతదేహాల శరీరభాగాలు భీకరంగా కనిపించాయి. అనంతరం కేసు నమోదు చేసి విచారించి తాజాగా మరణశిక్ష విధించారు.

సంపన్న దేశాల్లో మరణశిక్ష లేదు. కానీ జపాన్ లో ఉంది. గత ఏడాది నలుగురు కుటుంబ సభ్యులను చంపిన చైనీయుడికి జపాన్ లో ఉరిశిక్ష పడింది. ఇప్పుడు ఈ ట్విట్టర్ కిల్లర్ కు పడింది.
Tags:    

Similar News