డిసెంబర్ 31 .. మందుబాబులకు ఎంతో ఇష్టమైన రోజు , ఎందుకంటే ఆ రోజు పీకలదాకా మందుతాగి , తెల్లవారే వరకు తుళుతుంటారు. యువత నుండి పెద్దవారి వరకు ఆ రోజు తెగ హడావుడి చేసి ఎక్సైజ్ శాఖ ఆదాయాన్ని భారీగా పెంచేస్తారు. ఇది ప్రతి ఏడాది కూడా జరిగే తంతునే. ఇక ఈ ఏడాది గడిచిన నాలుగు రోజులలో మద్యాన్ని మంచి నీళ్లలా తాగేశారు. ఈ సంవత్సరం నూతన సంవత్సర వేడుకలకు పోలీసులు అనుమతించకపోయినా గతేడాది కంటే ఈ సారి మద్యం విక్రయాలు అధికంగానే జరిగాయని ఎక్పైజ్ అధికారులు చెబుతున్నారు.
హైదరాబాద్ నగరంలోని పలు ప్లై ఓవర్లపై ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసులు ప్రమాదాల నివారణకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్డు, దుర్గం చెరువు తీగల వంతెనపైకి రాత్రి వాహనాలను అనుమతించలేదు. అయినప్పటికీ మందుబాబులు ఇళ్లలోనే మందును తెగ తాగేశారు. ఎక్సైజ్ లెక్కల ప్రకారం గడిచిన నాలుగు రోజులుగా మద్యం విక్రయాలని చూస్తే .. మొత్తంగా చూసుకుంటే రూ.759 కోట్ల విలువైన మద్యం అమ్ముడైనట్లు అధికారులు చెబుతున్నారు. 8.61 కోట్ల లిక్కర్ కేసులు, 6.62 కోట్ల బీరు కేసులు అమ్ముడుపోయాయి. గతేడాదితో పోలిస్తే దాదాపు రూ.200 కోట్ల అధిక ఆదాయం వచ్చింది. డిసెంబర్ 28వ తేదీన రూ.205.18 కోట్లు, 29న రూ.150 కోట్లు, 30న 211.35 కోట్లు, 31వ తేదీన రూ.193 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి.