అసోం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ముందుస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా వేలాది పందుల్ని చంపేందుకు నిర్ణయించింది. ఎందుకిలా? అన్న విషయంలోకి వెళితే.. అసోంలో ఆఫ్రికన్ సైన్ ఫ్లూ పెరిగింది. అది అంతకంతకూ పెరిగి పోయే పరిస్థితి వచ్చింది. దీంతో.. స్వైన్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న పన్నెండు వేల పందుల్ని చంపేయాలని అసోం రాష్ట్ర సర్కారు నిర్ణయాని కి వచ్చింది.
ఇంత భారీ గా పందుల్ని చంపేస్తున్న నేపథ్యం లో.. వాటి యజమానులకు పరిహారం చెల్లించనున్నారు. ఏ ప్రాంతాల్లో అయితే ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ బయపడిందో.. అక్కడి పందుల్ని చంపేయనున్నారు. ఈ ఫ్లూ కారణంగా ఇప్పటివరకు రాష్ట్రంలో 18 వేలకు పైగా పందుల్ని మరణించాయి. రాష్ట్రం లోని మొత్తం 14 జిల్లాల్లో స్వైన్ ఫ్లూ ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
దసరాకు ముందే పందుల్ని చంపేసే ప్రోగ్రాం పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి చర్యలు తక్షణమే తీసుకోవాలని.. పందుల యజమానుల ఖాతాల్లో పరిహారాన్ని డిపాజిట్ చేయనున్నారు. 2019లో అసోంలో పందుల సంఖ్య 21 లక్షల ఉంటే.. ఇప్పుడు 30 లక్షలు ఉంటాయని చెబుతున్నారు. దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే... ఈశాన్య రాష్ట్రాల్లో పందుల పెంపకం ఎక్కువ గా ఉంటుంది.