చంద్రబాబు సభలో తీవ్ర విషాదం.. ఏడుగురు మృతి

Update: 2022-12-28 15:28 GMT
ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర మాత్రమే ఉండడంతో ప్రతిపక్ష టీడీపీ ప్రజల్లోకి వెళుతోంది. చంద్రబాబు సభలు, సమావేశాలకు సమాయత్తం అవుతుండగా.. ఆయన కుమారుడు లోకేష్ పాదయాత్ర ప్రకటించారు. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా ఏపీలోని కందుకూరులో సభ నిర్వహించారు. ఈ సభలో తీవ్ర విషాదం నెలకొంది.

కందుకూరు సభలో అపశృతి చోటుచేసుకుంది. భారీగా తరలివచ్చిన కార్యకర్తలతో తోపులాట జరగగా అదుపుతప్పి పక్కనే ఉన్న మురుగు కాల్వలో పడి ఏకంగా ఏడుగురు చనిపోయారు.

ఈ ప్రమాదానికి కారణం కందుకూరు సభ పక్కనే కాలువ కావడం గమనార్హం. తోపులాటలో కాలువలో కార్యకర్తలు పడిపోవడంతో 8 మంది అపస్మారక స్థితిలోకి పోయారు. దీంతో వారిని హుటాహుటిన అక్కడి నుంచి ఆస్పత్రికి తరలించారు.

నెల్లూరు జిల్లాలోని కందుకూరులో చంద్రబాబు బుధవారం సాయంత్రం నిర్వహించిన ఈ సభకు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సమయంలో కార్యకర్తల మధ్యలో తోపులాట జరగడంతో పక్కనే ఉన్న గుడంకట్ట ఔట్ లెట్ కెనాల్ లో పడిపోయారు. చంద్రబాబు అలెర్ట్ అయ్యి వెంటనే వారిని ఆస్పత్రికి తరలించేలా చేశారు. క్షతగాత్రులను తరలించగా చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

దీంతో చంద్రబాబు తన ప్రసంగాన్ని ఆపి ఆస్పత్రికి వెళ్లారు. బాధితుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనలో గాయపడిన వారిని చంద్రబాబు పరామర్శించారు. మృతుల  కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్తికసాయం ప్రకటించిన బాబు.. గాయపడిన వారికి పార్టీ అండగా ఉంటుందని.. బాధితుల పిల్లలను ఎన్టీఆర్ ట్రస్ట్ విద్యాసంస్థల్లో చదివిస్తామని హామీనిచ్చారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.


Full View
Tags:    

Similar News