రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారంటే భారీగా ఖర్చు పెట్టటం.. కోట్లు కుమ్మరించటం లాంటివి మామూలే. ఇక.. ఎన్నికల బరిలోకి దిగుతుంటే.. ఆ ఖర్చు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. గతంలో ఎప్పుడూ లేనంత భారీగా ఈసారి ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖర్చు పెడుతున్న వైనాన్ని చూస్తున్నదే.
ఇలాంటివేళ.. ఊహించని రీతిలో షాకిస్తున్నాడో అభ్యర్థి. ఆస్తుల కంటే కూడా ప్రజలకు సేవ చేయటమే లక్ష్యమన్న మాటను చెబుతున్న ఆయన.. తనకున్న ఆస్తి వివరాల్ని ప్రకటించిన వైనం షాకింగ్ గా మారింది. తన ఆస్తి అక్షరాల రూ.9 మాత్రమేనని చెబుతున్న ఆ అభ్యర్థి ఇప్పుడు చాలామందికి షాకింగ్ గా మారారు.
ఇంతకాలం అధ్యాత్మిక ప్రవచనాలతో ప్రజలకు సందేశాలు ఇచ్చిన ఆయన.. ఇప్పుడు ప్రజాసేవ చేసేందుకు ఎన్నికల బరిలోకి దిగినట్లుగా చెబుతున్నారు. ప్రజల నుంచి తీసుకుంటున్న డబ్బును రాజకీయ నేతలు తమ సొంత అభివృద్ధి కోసం వాడుకుంటున్నారని.. అందుకే సామాజిక సేవ చేయటానికి తాను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు వెల్లడించారు.
ఇంత విచిత్రంగా వ్యవహరిస్తున్న సదరు స్వామీజీ పేరేమిటంటే.. దీపక్ గంగారామ్ కటక్ ధోండ్ అలియాస్ శ్రీవేంకటేశ్వర మహా స్వామీజీ. మహారాష్ట్రలోని షోలాపూర్ కు చెందిన అతగాడు.. గోవా సీఎం మనోహర్ పారీకర్ మరణం నేపథ్యంలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ బరి నుంచి పోటీ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఎన్నికలు మే 19న జరగనున్నాయి. మరి.. ప్రజలు ఎలాంటి తీర్పునిస్తారో చూడాలి.