లోకేష్ పాదయాత్రను నడిపించేదంతా రెడ్డి గారేనట.

Update: 2023-01-24 09:28 GMT
తెలుగుదేశం భావి వారసుడు నారా లోకేష్ పాదయాత్రకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈ నెల 27న ఆయన కుప్పం నుంచి పాదయాత్రకు తొలి అడుగు వేస్తారు. ఈ పాదయాత్ర సుదీర్ఘమైనది, ఏకంగా నాలుగు వందల రోజులు పైబడి సాగుతోంది. అలాంటి పాదయాత్రతో పాటు నడిచేది నడిపించేది అంతా ఒక రెడ్డి గారు అని అంటున్నారు. ఆయన అనంతపురం జిల్లాకు చెందిన తెలుగుదేశం నేత దీపక్ రెడ్డి.

ఆయనకే ఏరి కోరి అప్పగించడం వెనక తెలుగుదేశం అధినాయకత్వం మాస్టర్ ప్లాన్ ఉంది అంటున్నారు. ఇంతకీ ఈ దీపక్ రెడ్డి ఎవరూ అంటే జేసీ బ్రదర్స్ లో తమ్ముడైన జేసీ ప్రభాకర్ రెడ్డి అల్లుడు. ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన యువ నేతగా అనంతపురం జిల్లాలో చక్రం తిప్పుతున్నారు. జగన్ ప్రభుత్వం మీద స్ట్రాంగ్ గా కామెంట్స్ చేయడంలో ఆయన ముందున్నారు.

ఇక లోకేష్ పాదయాత్ర తొలి మూడు నెలలూ అంతా రాయలసీమ బెల్ట్ లోనే సాగుతుంది. సహజంగా ఇక్కడ రెడ్లకు రాజకీయ పట్టు ఎక్కువ. దాంతో పాటు రాయలసీమ హార్డ్ కోర్ రీజియన్ గా వైసీపీకి ఉంది. దాంతో అదే సామాజిక వర్గం నుంచే రెడ్డిని తెచ్చి మరీ లోకేష్ కి వెంట ఉండేలా అధినాయకత్వం వ్యూహాత్మకంగానే ప్లాన్ చేసింది అంటునారు.

దీని వల్ల రాయలసీమలో లోకేష్ పాదయాత్ర పూర్తి సక్సెస్ అవుతుంది అని అంచనా కడుతున్నారు. లోకేష్ పాదయాత్ర లో ఆది నుంచి అంతం వరకూ దీపక్ రెడ్డి ఉంటారని అంటున్నారు. ఇక లోకేష్ పాదయాత్రకు సంబంధించి చాలా మందికి కీలకమైన బాధ్యతలు అప్పగించారు.

తెలుగుదేశం సోషల్ మీడియా వింగ్ కి జీవీ రెడ్డి అనే యువ నేతకు బాధ్యతలు ఈ మధ్యనే అప్పగించారు. ఇలా సీమ నేతలకు కీలకమైన బాధ్యతలు అప్పగించడం మీద చర్చ సాగుతోంది. జగన్ని విమర్శించే విషయంలో రెడ్లను ముందు పెట్టడం ద్వారా ఆ సామాజికవర్గంలోనూ వైసీపీకి పట్టున్న సీమలోనూ రాజకీయ లాభాన్ని గడించాలన్నదే తెలుగుదేశం ఎత్తుగడగా చెబుతున్నారు.

ఇక జేసీ ఫ్యామిలీ జగన్ అంటే కస్సున లేస్తుంది. అలనటి ఆ ఫ్యామిలీనే ముందు పెట్టి లోకేష్ తో పాదయాత్ర చేయిస్తే బస్తీ మే సవాల్ అన్నట్లుగా ఉంటుందని కూడా తలపోస్తున్నారు.

ఏది ఏమైనా చంద్రబాబు రాజకీయ చాణక్యం అంతా పాదయాత్రను కీలక సామాజిక వ్యక్తులతో డిజైన్ చేయడం చూస్తేనే తెలుస్తుంది అని అంటున్నారు. ప్రస్తుతం ఈ విషయం అధికార వైసీపీలో కూడా హాట్ టాపిక్ గా ఉంది అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News