ఆ వైరస్ పంజా.. మరో కొవిడ్ లానే

Update: 2023-03-07 17:00 GMT
కొవిడ్ తగ్గిందని సంతోషిస్తున్న సందర్భంలో.. మరో మహమ్మారి ముప్పు తప్పదా..? చాపకింద నీరులా వ్యాపిస్తున్న కొత్త వైరస్ కలవరం కలిగిస్తోందా..? నిపుణుల హెచ్చరికలు తీవ్రతను గమనించినందేనా? ఇప్పటికే ఐసీఎంఆర్, భారత వైద్యుల మండలి అప్రమత్తం చేసింది ఇందుకేనా..? అంటే దీనికి ఔననే సమాధానాలు వస్తున్నాయి. దాదాపు రెండు నెలలుగా వైరస్ తీవ్రత కొనసాగుతుండడం.. రోగులు దీర్ఘకాలం బాధపడుతుండడం.. ఒకరి నుంచి ఒకరికి ఎక్కువమందికి ముప్పు పొంచి ఉందని చాటుతోంది.

ఆ ప్రసిద్ధ వైద్యుడు ఏం చెప్పారంటే..

దేశంలో ఇన్ ఫ్లూయోంజా ఫ్లూ ఉనికిలో ఉందని మూడు రోజుల కిందట ఐసీఎంఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఐఎంఏ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రజలకు సూచించింది. కరచాలనాలు, ఆలింగనాలు వద్దని కోరింది. బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ ధరించాలని పేర్కొంది. వ్యాప్తిలో ఉన్న వైరస్ పేరును ఇన్‌ఫ్లుయెంజా H3N2గా తెలిపింది. దీనిబారినపడిన వారు కోలుకోవడానికి కాస్త ఎక్కువ సమయం పడుతుందని వివరించింది. తాజాగా దీనిపై ఢిల్లీ ఎయిమ్స్ మాజీ చీఫ్ రణదీప్ గులేరియా తీవ్ర స్థాయిలో హెచ్చరికలు చేశారు.

కొవిడ్ లా వ్యాప్తి..

హెచ్3ఎన్2 కొవిడ్‌లా వ్యాపిస్తుందని.. వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని గులేరియా చెప్పారు. హెచ్3ఎన్2 డ్రాప్ లెట్ వైరస్. అంటే తుంపర్ల ద్వారా వ్యాపించే వైరస్ అన్నమాట. దగ్గినప్పుడు, తమ్మినప్పుడు, లాలాజలం ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఈ నేపథ్యంలో రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని గులేరియా ప్రజలకు సూచించారు. H3N2 కేసుల పెరుగుదలపై ఆయన  మాట్లాడారు. ఏటా వ్యాపించేదే..? ఇవీ లక్షణాలు.. హెచ్3ఎన్2 ప్రతి సంవత్సరం ఈ సమయంలో చుక్కలు, పరివర్తనల ద్వారా వ్యాపిస్తుంది. పండుగల సీజన్‌ కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.

ముఖ్యంగా వృద్ధులు, దీర్ఘకాల వ్యాధులు ఉన్నవారు. కాగా, హెచ్3ఎన్2 లక్షణాల గురించి గులేరియా మాట్లాడుతూ బాధితుల్లో గొంతు నొప్పితో పాటు జ్వరం ఉంటుందని చెప్పారు. గొంతు, దగ్గు, ఒళ్లు నొప్పులు, ముక్కు కారటం. వైరస్ పరివర్తనంలో వ్యక్తుల కారణంగా కేసుల పెరుగుతున్నాయని ఆయన అన్నారు ఆ కారణంగా రోగనిరోధక శక్తి తగ్గింది "మనకు చాలా సంవత్సరాల క్రితం H1N1 కారణంగా మహమ్మారి వచ్చింది. ఆ వైరస్ ప్రసరణ జాతి H3N2. ఇది ఒక సాధారణ ఇన్ ఫ్లు యోంజా జాతి. వైరస్ కొద్దిగా పరివర్తనం చెందుతున్న నేపథ్యంలో మనం ఎక్కువ కేసులను చూస్తున్నాంవైరస్‌కు వ్యతిరేకంగా రోగ నిరోధక శక్తి కొద్దిగా తగ్గుతుంది.

ఈ నేపథ్యంల ఏమాత్రం అవకాశం ఉన్నా.. వ్యక్తులు వైరస్ బారిన పడతారు. అయితే, ఇన్ఫెక్షన్ మరింత తేలికగా ఉంటుంది" అని డాక్టర్ గులేరియా చెప్పారు. ప్రతి సంవత్సరం వైరస్ కొద్దిగా మారుతుందని అన్నారు. హెచ్3ఎన్2 వైరస్ ఎ నుంచి వస్తుందని వివరించారు. ఇన్ ఫ్లుయోంజా వైరస్‌ల కుటుంబం, దాని వివిధ ఉప రకాలను బట్టి పరివర్తన చెందుతుంది. వైరస్ కొద్దిగా పరివర్తన చెందుతుంది లేదా మారుతుంది. ప్రతి సంవత్సరం, యాంటిజెనిక్ డ్రిఫ్ట్ అని పిలుస్తారు. కాగా, కేసుల పెరుగుదల కారణంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గులేరియా తెలిపారు. పెద్దఎత్తున ఆసుపత్రుల్లో చేరికలు లేవని గుర్తుచేస్తున్నారు.

ఇదీ నివారణ..

హెచ్3ఎన్2 కేసులు రెండు కారణాల వల్ల పెరుగుతాయని డాక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. వాతావరణం మారినప్పుడు, కొవిడ్ తర్వాత రద్దీగా ఉండే ప్రదేశాల్లో ప్రజలు మాస్క్ లు ధరించనందున కేసులు నమోదవుతాయని పేర్కొన్నారు. రద్దీ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించడమే వైరస్ బారిన పడకుండా ఉండేందుకు మార్గంగా గులేరియా తెలిపారు. "తరచుగా చేతులు కడుక్కోవాలి. భౌతిక దూరం పాటించాలి’’ అని స్పష్టం చేశారు. హై రిస్క్ గ్రూపుల వారికి, వృద్ధులకు టీకా కూడ అందుబాటులోకి వచ్చినసంగతిని గుర్తుచేశారు.

Similar News