పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో దేశవ్యాప్తంగా వందల కోట్ల రూపాయల అవినీతి సంపద బయటపడుతోంది. అధికారుల సోదాల్లో వెలుగుచూస్తున్న ఈ అక్రమార్జనలో పెద్ద ఎత్తున కొత్త నోట్లూ ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఓవైపు సామాన్యుడు 100 రూపాయల కోసం గంటల తరబడి బ్యాంకులు, ఎటిఎమ్‌ల వద్ద పడిగాపులు గాస్తుంటే, మరోవైపు బడా బాబుల దగ్గర కోటానుకోట్ల అక్రమ సంపద వెలుగు చూస్తుండటం బ్యాంకర్లు, ఇతర ఆర్థిక లావాదేవీల చిత్తశుద్ధిని ప్రశ్నార్థకం అవుతోంది. తాజాగా ఓ లాయర్ ఆస్తులు షాక్ కలిగించే రీతిలో వెలుగు చూశాయి.
ఆగ్నేయ ఢిల్లీలోని జికె-1 ఏరియాలో ఓ న్యాయవాదికి చెందిన టిఅండ్‌టి లా సంస్థ నుంచి దాదాపు 13.5 కోట్ల రూపాయల నగదును ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 2.6 కోట్ల రూపాయలు కొత్త కరెన్సీనే కావడం గమనార్హం. పనులు మానుకుని మరీ బ్యాంకులకు వెళ్తున్న సాధారణ ప్రజానీకానికి ఒకటి, రెండు నోట్ల (2,000 రూపాయల నోట్లు)కు మించి దొరకకుండా ఉంటే, ఇంత భారీ స్థాయిలో కొత్త కరెన్సీ దారి మళ్లుతుండటం బ్యాంకులు, పోస్ట్ఫాసుల సిబ్బంది అవినీతికి, ప్రభుత్వ విధాన లోపాలకు అద్దం పడుతోంది. ఇకపోతే పట్టుబడిన కరెన్సీలో 2.62 కోట్ల రూపాయల విలువైన కొత్త 2,000 రూపాయల నోట్లుండగా, 7.7 కోట్ల రూపాయల పాత 1,000 రూపాయల నోట్లు, 3.06 కోట్ల రూపాయలకు సమానమైన 100 రూపాయల నోట్లు, 11 లక్షల రూపాయల 50 రూపాయల నోట్లున్నాయని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్) రవీంద్ర యాదవ్ తెలిపారు. అలాగే రెండు నోట్ల లెక్కింపు యంత్రాలనూ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇదిలావుంటే ఇటీవలే ఈ ప్రముఖ న్యాయవాదికి సంబంధించిన నివాసాలు, సంస్థల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆ తర్వాత 125 కోట్ల రూపాయలకుపైగా నల్లధనాన్ని సదరు న్యాయవాదే ప్రకటించారు. ఈ క్రమంలో అధికారులు మరింత లోతుగా దృష్టి పెట్టడంతోనే మరో 13.5 కోట్ల రూపాయల సొమ్ము బయటపడింది.
శనివారం రాత్రి బాగా పొద్దుపోయాక అందుకున్న పక్కా సమాచారంతో దాడులు నిర్వహించగా, ఈ అక్రమ సంపద వెలుగుచూసింది. ఐఎస్‌సి ఎసిపి సంజయ్ సెహ్రవాత్ ఆధ్వర్యంలో క్రైమ్ డిసిపి భిషమ్ సింగ్ పర్యవేక్షణలో ఈ దాడులు జరిగాయి. ఇటీవల ఢిల్లీతోపాటు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కత్తా తదితర ప్రధాన నగరాల్లోనూ భారీగా పాత పెద్ద నోట్లు, కొత్త నోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నది తెలిసిందే.