పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య జగిరిన ఘర్షణలు హింసాత్మకంగా మారడంతో ఎంతోమంది అమాయుకులు బలయ్యారు. పరస్పరం దాడి చేసుకోవడమే కాకుండా సాధారణ ప్రజలపై కూడా దాడులకు పాల్పడడంతో మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. సర్వత్రా ఈ ఘటనలపై నిరసన వ్యక్తమవుతోంది. ప్రజాస్వామ్యవాదులు, శాంతికాముకులు ఈశాన్య ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలపై ఆందోళన చెందుతున్నారు. వెంటనే ప్రభుత్వ బలగాలు మొహరించి పరిస్థితులను అదుపులోకి తీసుకురావాలని కోరుతున్నారు. అయితే ఈ ఆందోళనల మధ్య స్థానికులు మానవత్వం చాటారు. విద్యార్థులకు స్థానికులు రక్షణ కవచంగా నిలిచిన సన్నివేశం ప్రస్తుతం వైరలైంది.
ఈశాన్య ఢిల్లీలో అల్లర్లు చెలరేగుతుంటే దానికి సమీపంలో ఉన్న ఒక ప్రాంతంలో మాత్రం ఐకమత్యం చాటుతుండడం విశేషం. ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలో విద్యాలయాలు మూసివేసి సెలవులు ప్రకటించగా మరోవైపు విద్యార్థులకు పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతంలో ప్రజలంతా కులమతాలకతీతంగా ఒక్కటై తమ ఐక్యత చాటుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. తమని తాము రక్షించుకోవడమే కాకుండా.. అల్లరిమూకలను తమవైపు రాకుండా అడ్డుకుంటూ తరిమి తరిమి కొడుతున్నారు.
తమ ప్రాంతంలో అల్లర్లు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్త పడుతున్నారు. ఈ పరిస్థితిల్లో తూర్పు ఢిల్లీలోని యమునా విహార్‌లో పాఠశాల నుంచి బయటకు వస్తున్న విద్యార్థులకు స్థానికులు మానవ హారంగా ఏర్పడి రక్షణగా నిలిచారు. కులం, మతం, లింగ బేధం లేకుండా ప్రజలు ఐక్యతతో అండగా నిలిచారు. దీంతో ఆ విద్యార్థులు సురక్షితంగా తమ నివాసాలకు చేరుకున్నారు. అల్లర్లు చేయడానికి వస్తున్న ఆకతాయిలను గుంపులుగుంపులుగా ఉంటూ వారిని వెళ్లగొడుతున్నారు.