మోస్ట్ డేంజ‌ర‌స్ క‌రోనా వేరియంట్ అదే!

Update: 2021-06-06 02:30 GMT
గ‌తేడాది చైనాలో వెలుగుచూసిన క‌రోనా వైర‌స్ కు.. ఇప్పుడు ప్ర‌పంచంలో మ‌నుగ‌డ‌లో కొవిడ్ కు అస‌లు సంబంధ‌మే లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నో ర‌కాలుగా రూపాంత‌రం చెందింది ఈ వైర‌స్‌. అయితే.. ఇందులో ప‌లు వేరియంట్లు ప్ర‌మాద‌క‌రంగా మారాయి.

అందులో బ్రెజిల్ లో వెలుగుచూసిన (P.1), సౌతాఫ్రికాలో గుర్తించిన‌ (B.1.351), బ్రిట‌న్ లో రూపాంత‌రం చెందిన‌(B.1.1.7)తోపాటు భార‌త్ లో వెలుగు చూసిన (B.1.617) వేరియంట్లు ప్ర‌మాద‌క‌రంగా మారాయి. అయితే.. వీట‌న్నింటిలో భార‌త్ లో గుర్తించిన B.1.617 వేరియంట్ ఇప్ప‌టి వ‌ర‌కు గుర్తించిన అన్ని ర‌కాల మ్యుటెంట్ల క‌న్నా ప్ర‌మాద‌క‌ర‌మైన‌ద‌ని నిపుణులు భావిస్తున్నారు.

గ‌తేడాది అక్టోబ‌రులో ఈ ర‌కం బ‌య‌ట‌ప‌డింది. ఇందులోనూ మ‌రో మూడు ర‌కాలు వెలుగులోకి వ‌చ్చాయి. అవి.. B.1.617.1, B.1.617.2, B.1.617.3గా ఉన్నాయి. అయితే.. ఇందులో B.1.617.2 ర‌కం చాలా బ‌లంగా ఉంద‌ని డ‌బ్ల్యూహెచ్‌వో నిపుణులు చెబుతున్నారు. భార‌త్ లో సెకండ్ వేవ్ ఈ స్థాయిలో విజృంభించ‌డానికి కూడా ఈ వేరియంటే కార‌ణ‌మ‌ని భావిస్తోంది. భార‌త్ లో దాదాపు 12 వేల‌కు పైగా వేరియంట్స్ ను గుర్తించ‌గా.. ఇవే అత్యంత ప్ర‌మాద‌క‌రంగా త‌యారైన‌ట్టు నిపుణులు నిర్ధారించారు.

ఈ వైర‌స్ ఇప్ప‌టికే 60 దేశాల‌కు విస్త‌రించిన‌ట్టు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇందులో బ్రిట‌న్ లో ఎక్కువ‌గా ఈ వేరియంట్ ప్ర‌భావం చూపుతోంది. ఈ విష‌యాన్ని ప‌బ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ వెల్ల‌డించింది. ఇటీవ‌ల సేక‌రించిన శాంపిళ్ల‌లో ఏకంగా 61 శాతం వ‌ర‌కు ఇదే వేరియంట్ బ‌య‌ట‌ప‌డిన‌ట్టు తెలిపింది. ఈ వైర‌స్ కు డెల్టా వేరియంట్ అని ఈ మ‌ధ్య‌నే డ‌బ్ల్యూహెచ్ వో ప్ర‌క‌టించింది.
Tags:    

Similar News