హీరోయిన్ శృతిహాసన్ పై క్రిమినల్ కేసు పెట్టాలని బీజేపీ నేతలు డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. ఆమె అక్రమానికి పాల్పడ్డారని ఫిర్యాదు కూడా చేసినట్టు సమాచారం. ఇంతకీ ఆమె చేసిన తప్పు ఏంటనేది తెలియాలంటే.. ఈ వార్త చదవాల్సిందే.
తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. అయితే.. ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం.. తన కూతుళ్లు శృతిహాసన్, అక్షర హాసన్ తో కలిసి కోయంబత్తూరు నియోజకవర్గానికి వెళ్లారు.
ఈ క్రమంలో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు ఓ బూత్ లోకి వెళ్లారట కమల్. ఆయన వెంట శృతిహాసన్ కూడా ఉన్నట్టు సమాచారం. దీనిపై బీజేపీ నేతలు అభ్యంతరం తెలిపారు. కేవలం ఏజెంట్లు మాత్రమే బూత్ లోకి వెళ్లడానికి అనుమతి ఉందని, శృతిహాసన్ లోనికి వెళ్లడం ద్వారా.. ఆ నిబంధనను అతిక్రమించారని అన్నట్టుగా తెలిసింది.
అందువల్ల ఆమెపై క్రిమినల్ కేసు పెట్టాలని డిమాండ్ చేసినట్టు సమాచారం. ఈ మేరకు ఎన్నికల కమిషన్ కు లేఖ కూడా రాశారని తెలుస్తోంది. బీజేపీ అభ్యర్థి వనతి శ్రీనివాసన్ తరపున బీజేపీ జిల్లా అధ్యక్షుడు నందకుమార్ జిల్లా ఎన్నికల అధికారికి లేఖ రాసినట్టు సమాచారం.