దేశవ్యాప్తంగా విద్యుత్ కు గరిష్ట డిమాండ్..: చరిత్రలోనే తొలిసారి..

Update: 2022-06-10 09:30 GMT
బొగ్గ కొరత.. అధిక ఉష్ణోగ్రత కారణంగా దేశంలో విద్యుత్ వినియోగం విపరీతంగా పెరగుతోంది. జనజీవన అవసరాలతో పాటు పరిశ్రమలు విద్యుత్ వాడకాన్ని ఎక్కువ చేయడంతో పవర్ డిమాండ్ రోజురోజుకు పెరిగిపోతుంది.  కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపిన ప్రకారం గురువారం మధ్యాహ్నం 3 గంటలకు 2,10,793 మెగావాట్ల విద్యుత్ వినియోగించారని తెలిపింది. ఇది ఇండియా చరిత్రలోనే మొదటిసారి అని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు విద్యుత్ అవసరంపై విద్యుత్ శాఖ కేంద్రానికి లేఖ రాసినట్లు సమాచారం.

దేశంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతతో పాటు విద్యుత్ అవసరాలు విపరీతంగా పెరిగాయి. దీంతో విద్యుత్ వినియోగానికి డిమాండ్ పెరుగుతోంది. గత ఏప్రిల్ లో విద్యుత్ డిమాండ్ 207111 మెగావాట్లకు చేరుకోగా ఇప్పుడు 2,10,793 మెగావాట్లుగా నమోదైంది.

ఇప్పటి వరకు ఇంత విద్యుత్ వినియోగం నమోదు కాలేదని విద్యుత్ శాఖ తెలిపింది. జూలై 7 2021న విద్యుత్ కు గరిష్ట డిమాండ్ 200.53 గిగా వాట్ల కాగా తాజాగా ఆ రికార్డును బ్రేక్ చేసింది. అయితే ఒక్కో రోజు ఒక్కో విధంగా విద్యుత్ వినియోగం ఏర్పడుతుందని మంత్రిత్వ శాఖ తెలుపుతోంది.

రానున్న రోజుల్లో ఈ విద్యుత్ వినియోగం పెరుగుతుందా..? లేదా..? అనేది ఇప్పుడే చెప్పలేం. కానీ పరిస్థితులను భట్టి చూస్తే విద్యుత్ అవసరం మాత్రం విపరీతంగా ఉండే అవకాశం ఉందని లెక్కలు చెబుతున్నాయి.

ఇప్పటికే దేశంలో విద్యుత్ కొరత తీవ్రంగా ఉండడంతో బొగ్గు సరఫరా వేగం పెంచింది. పలు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసి మరీ బొగ్గు సరఫరాను చేసింది. అయినా విద్యుత్ వినియోగం మరింత పెరిగిపోవడంతో అససరమున్న విద్యుత్ ను సరఫరా చేయలేకపోయింది.

ఇదే సంవత్సరం మార్చి నెలలో విద్యుత్ డిమాండ్ సుమారు 8.9 శాతం పెరిగినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే గత మే, జూన్ నెలల్లో 2,15,220 మెగా వాట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. తాజా లెక్కల ప్రకారం 2,10,893 మెగావాట్లకు చేరుకోవడం చర్చనీయాంశంగా మారింది. దీనిని భట్టి చూస్తే రానున్న రోజుల్లో విద్యుత్ వినియోగం మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.
Tags:    

Similar News