పాత సచివాలయం కూల్చివేతలో భాగంగా ఆ ప్రాంగణంలోని మసీదు, ఆలయంపై భవన శిథిలాలు పడ్డాయి. ఆలయం.. మసీదు దెబ్బతిన్నది. దీనిపై హిందూ సంఘాలు.. ముస్లిం మతస్తుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పందించారు. మసీదు, ఆలయం దెబ్బతినడంపై సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. దీనివలన నష్టపోయినది ఏమీ లేదని, తిరిగి నిర్మిస్తామని ప్రకటించారు. అయితే గతంలో కాకుండా ఇప్పుడు మరింత విశాలంగా ఆలయం, మసీదు నిర్మిస్తామని తెలిపారు.
తాజాగా శుక్రవారం మసీదు, ఆలయంపై భవన శిథిలాలు పడడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి ఈ విధంగా మాట్లాడారు. ``సచివాలయంలో ఎత్తయిన భవనాలు కూల్చివేత సమయంలో శిథిలాలు మసీదు, ఆలయంపై పడ్డాయి. దీనివల్ల వాటికి కొంత ఇబ్బంది కలిగింది. ఇది నాకు ఎంతో బాధించింది. చాలా విచారకరం. ఇలా జరగడం పట్ల చింతిస్తున్నాను. ప్రభుత్వ ఉద్దేశం పాత భవనాల స్థానంలో కొత్తవి నిర్మించడం. అంతే తప్ప మసీదు, మందిరాలను చెడగొట్టడం ప్రభుత్వ ఉద్దేశం కాదు. సచివాలయం ప్రాంతంలోనే కొత్తగా మసీదు, ఆలయం ఎన్ని కోట్లయినా వెచ్చించి సరే పూర్తి ప్రభుత్వ సొమ్ముతో నిర్మిస్తాం. ఇప్పుడు ఉన్న దాని కన్నా ఎక్కువ విస్తీర్ణంలో విశాలంగా.. సౌకర్యవంతంగా ఆలయం, మసీదు నిర్మాణాన్ని ప్రభుత్వం చేపడుతుంది`` అని ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.