డిప్యూటీ స్పీక‌ర్ లెక్క‌తేలింది...నేడే నామినేష‌న్‌

Update: 2019-02-22 17:13 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఒక్కో ప‌ద‌వి ఎంపిక ప్ర‌క్రియ పూర్తి చేస్తున్నారు. ముందుగా కీల‌క‌మైన మంత్రివ‌ర్గ ప్ర‌క్రియ‌ను పూర్తి చేసిన గులాబీ ద‌ళ‌ప‌తి అనంత‌రం కీల‌క‌మైన ఎమ్మెల్సీ ఎన్నిక‌లకు త‌మ పార్టీ త‌ర‌ఫున రంగంలోకి దిగేవారిని ఖ‌రారు చేశారు. తాజాగా మ‌రో ముఖ్య‌మైన స్థానానికి సైతం ఆయ‌న అభ్య‌ర్థిని ఖ‌రారు. డిప్యూటీ స్పీకర్‌ గా మాజీ మంత్రి పద్మారావు గౌడ్ పేరును టీఆర్ ఎస్ ఖరారు చేసింది. దీనితో ఆయన శనివారం నామినేషన్ దాఖలు చేయనున్నారు.

ఫిబ్రవరి 22వ తేదీ శుక్రవారం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవ‌గా శాసనసభలో సీఎం కేసీఆర్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ ను ప్రవేశ పెట్టారు. బడ్జెట్ ముగిసిన తరువాత ఉభయసభలు ఫిబ్రవరి 23వ తేదీ శనివారానికి వాయిదా పడ్డాయి. అదే రోజు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ప్రక్రియ చేపట్టనున్నారు. నోటిఫికేషన్‌ తో పాటు నామినేషన్ ప్రక్రియ చేపట్టనున్నారని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ ఈ ప‌ద‌వికి త‌మ అభ్య‌ర్థిని ఖ‌రారు చేశారు. గతంలో టీఆర్ ఎస్ ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన పద్మారావు గౌడ్‌ ను ఈ ప‌ద‌వికి ఎంపిక చేశారు. శ‌నివారం ఆయ‌న నామినేష‌న్ వేయ‌నున్నారు.

ఇదిలాఉండ‌గా - జంట నగరాల్లో సీనియర్ నేతగా - మంత్రిగా మంచి గుర్తింపు ఉంది. సిటీలో ఓ సామాజికవర్గంలోనూ మంచి నేతగా ఉన్న పద్మారావుకు...రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేబినెట్‌లో ఆయనకు చోటు దక్కలేదు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
Tags:    

Similar News