మాజీ సీఎం కి కరోనా పాజిటివ్ !

Update: 2020-10-24 15:30 GMT
దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. ప్రతిరోజూ కూడా కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతూనే ఉన్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా మహమ్మారి జోరుకి బ్రేకులు పడటం లేదు. సామాన్యుల నుండి ప్రముఖులు , విఐపిల వరకు అందరూ ఈ కరోనా భారిన పడుతున్నారు. ముఖ్యంగా కరోనా భారిన పడే ప్రజాప్రతినిధుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కరోనా బారినపడగా, తాజాగా మాజీ ముఖ్యమంత్రి కరోనా భారినపడ్డారు.

మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత, బీహార్ ఎన్నికలకు రాష్ట్ర ఇన్ ఛార్జ్ కూడా అయిన దేవేంద్ర ఫడ్నవిస్ కి కరోనా పాజిటివ్ అంటూ ప్రసారమాధ్యమాల్లో ప్రచారం అవుతుంది. తన ఆరోగ్య పరిస్థితిపై శనివారం దేవేంద్ర ఫడ్నవిస్ ట్వీట్ చేస్తూ.. ఇన్ని రోజులూ తాను పార్టీకోసం పని చేస్తూ వచ్చానని, ఇక కొంతకాలం బ్రేక్ తీసుకోవాలని భగవంతుడు తనను కోరాడని పేర్కొన్నారు. తనతో కాంటాక్టులో ఉన్నవారు కరోనా టెస్టులు చేయించుకోవాలని కోరారు. ఐసోలేషన్ లో ఉన్న నేను డాక్టర్ల సలహాపై మందులు తీసుకుంటున్నా అని దేవేంద్ర ఫడ్నవిస్ అన్నారు. ఫడ్నవిస్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో గత కొన్ని వారాలుగా బీజేపీ తరఫున కీలక పాత్ర పోషిస్తున్నారు. పార్టీ అభ్యర్థుల ఎంపికలోనూ నియోజకవర్గ పార్టీ నేతలతోనూ విస్తృత సంప్రదింపులు జరిపారు. ఈ నేపథ్యంలో ఆయనకు కరోనా సోకడంతో ఆయన ఐసొలేషన్‌లో ఉంటూ పార్టీ ఎన్నికల ప్రచార వ్యూహాలను పర్యవేక్షించనున్నారు.
Tags:    

Similar News