డ్రంక్ అండ్ డ్రైవ్ గురిచి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. హైదరాబాద్ లో అయితే - వారాంతాల్లో తప్పకుండా నిర్వహిస్తున్నారు. జిల్లాల్లో వివిధ సందర్భాల్లో తాగుబోతులను గుర్తించేందుకు - తాగి వాహనాలు జరపడం వల్ల జరిగే ప్రమాదానలను దూరం చేసేందుకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇలా వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్న మాదిరిగానే ఇక విమానాలు నడిపే వారికి కూడా పరీక్షలు నిర్వహించనున్నారు. కేవలం విమానాలు నడిపే వారికే కాదు...విమానం సిబ్బందికి డ్రగ్స్ సంబంధ పరీక్షలు నిర్వహించాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిర్ణయించింది.
పైలట్లు - ఎయిర్ హోస్టులు - ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్(ఏటీసీ)కు తొలిదశలో ఢిల్లీ - ముంబై - కోల్ కతా - చెన్నై - బెంగళూరు - హైదరాబాద్ విమానాశ్రయాల్లో లేదా ఏటీసీ కాంప్లెక్స్ లలో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. మూత్ర నమూనాల్లో మత్తుపదార్థాల ఆనవాళ్లను పరీక్షిస్తారు. ఇందులో పాజిటివ్ అని తేలినవారికి ల్యాబొరేటరీల్లో నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారు. అక్కడ కూడా పాజిటివ్ గా వస్తే పునరావాస కేంద్రాలకు పంపుతారు. కోలుకున్న తర్వాత మళ్లీ పరీక్షలు నిర్వహించి - వైద్యుల నుంచి ధ్రువీకరణ పత్రం పొందిన తర్వాతే క్రీయాశీలక విధుల్లోకి తీసుకుంటారు. ఆ తర్వాత మళ్లీ డ్రగ్స్ తీసుకొని పట్టుబడితే లైసెన్స్ ను రద్దు చేస్తారు. ఈ డ్రంక్ ఆండ్ డ్రైవ్ పరీక్షలకు సంబంధించి నిబంధనలను తర్వలో ఖరారు చేయనున్నట్లు డీజీసీఏ తెలిపింది.