అదే జరిగితే కేసీఆర్ పాకిస్థాన్‌కు పోవాల్సిందే: అర్వింద్ హాట్ కామెంట్స్
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు సహా.. సీఎం కేసీఆర్‌పై బీజేపీ నిజామాబాద్ ఎంపీ, ఫైర్ బ్రాండ్ ధర్మపురి అర్వింద్ విరుచుకుప డ్డారు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. అవసరమైతే.. సీతక్కను ముఖ్యమంత్రిని చేస్తామన్న వ్యాఖ్యలపై అర్వింద్ మండిపడ్డారు. "ముఖ్యమంత్రి కాదు.. మొదట సీతక్కను పీసీసీ చేయగలరా? రేవంత్ సమాధానం చెప్పాలి.
అవసరమైతే కాదు.. సీతక్కను సీఎం చెస్తామని రేవంత్ రెడ్డి ఎందుకు చెప్పలేదు? '' అని అర్వింద్ ప్రశ్నించారు. సీతక్కపై అబిమానం ఉంటే.. ముందుగా ఆమెను రాష్ట్ర పార్టీకి అధ్యక్షురాలిని చేయాలని సూచించారు.
అదే సమయంలో సీఎం కేసీఆర్‌పైనా అర్వింద్ విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు తాము మద్దతు ఇచ్చేది లేదన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై ఆయన విరుచుకుపడ్డారు.
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కులాలు, మతాలకు అతీతంగా పాలన చేస్తోందని.. ఈక్రమంలోనే ఉమ్మడి పౌరస్మృతి బిల్లును తీసుకువస్తోందని చెప్పారు. దీనికి ఎవరు మద్దతిచ్చినా.. ఇవ్వకపోయినా..కేంద్రంలోని మోడీ బలంతోనే దీనిని ఆమోదించుకుంటారనిఅర్వింద్ చెప్పారు.
ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) బిల్లు ఉభయ సభల్లో పాస్ అయ్యాక సీఎం కేసీఆర్ పాకిస్థాన్ పోవాల్సిందే అని అర్వింద్ వ్యాఖ్యానించారు. ముస్లిం ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్‌కు పడతాయన్న భయం కేసీఆర్‌లో మొదలైందని ఎద్దేవా చేశారు.
అందుకే ముస్లిం మత పెద్దలను తన ఇంటికి పిలుచుకుని కేసీఆర్ మీటింగ్ పెట్టుకున్నారని అన్నారు. యూసీసీ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు ఇవ్వకున్నా పాస్ అవుతుందని చెప్పారు. యూసీసీ బిల్లు పాస్ అయ్యాక కేసీఆర్ పాకిస్థాన్ పోతానంటే వెళ్లిపోవచ్చునని అన్నారు.