దొంగ ఓటు వేసిన మున్సిపల్ చైర్మైన్ కౌన్సిలర్ల ధర్న!

Update: 2021-03-19 13:39 GMT
ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓటు వేశారనే ఆరోపణలపై తాండూరు మున్సిపల్ ఛైర్‌పర్సన్ తాటికొండ స్వప్నను వెంటనే పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్, సీపీఎం, తెలంగాణ జన సమితి పార్టీ కౌన్సిలర్లు ధర్నాకు దిగారు. మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఓటు తిరస్కరించడం జరిగిందని చెప్పినప్పటికీ తోటికోడలు పేరుతో ఉన్న ఓటును స్వప్న వేశారని వారు ఆరోపించారు. ఆ ఆధారాలను రాష్ట్ర ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ కు సమర్పించి ఫిర్యాదు చేశామని కౌన్సిలర్లు వెల్లడించారు. దొంగ ఓటును వేసిన స్వప్నను వెంటనే ఛైర్మన్ విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో మున్సిపల్ చైర్ పర్సన్ దర్జాగా దొంగ ఓటు వేసి వచ్చారని తెలిపారు. మున్సిపల్ చైర్ పర్సన్ నమోదు చేసుకున్న ఓటు రిజెక్ట్ అయ్యిందని  చెప్పినా కూడా తన తోడికోడలు పేరు తాటికొండ స్వప్న అని ఉండడంతో.. ఆ పేరుపై చైర్ పర్సన్ ఎన్నికల్లో దొంగ ఓటు వేశారన్నారు. ఈ దొంగ ఓటుకు సంబంధించిన పూర్తి సాక్ష్యాధారాలను అధికారుల ద్వారా సేకరించామని రాష్ట్ర ఎన్నికల అధికారితో పాటు.. జిల్లా కలెక్టర్ కూడా ఆమెపై ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఈ విధంగా దొంగ ఓటు వేయడం వల్ల తాండూర్ నియోజకవర్గం పరువు పోయిందన్నారు.

వెంటనే ఆమెని మున్సిపల్ చైర్మన్ విధుల నుంచి తొలగించాలని ధర్నా చేశారు. ఆమెపై వెంటనే అధికారులు చర్యలు తీసుకోకపోతే .. ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు కౌన్సిలర్లు. అధికార పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ పార్టీని అడ్డంపెట్టుకుని గతంలో కూడా మున్సిపాలిటీ పరిధిలో పలు అవకతవకలకు పాల్పడిన ఘటనలు ఎన్నో ఉన్నాయని చెప్పారు.  వీటన్నింటిని పరిగణనలోకి తీసుకొని అధికారులు వెంటనే చైర్మన్ పై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు కౌన్సిలర్లు. 
Tags:    

Similar News