లాక్ డౌన్ :ఫామ్‌ హౌస్‌ లో బిలియనీర్ల విందు..ఐఎఎస్ పై వేటు!

Update: 2020-04-11 01:30 GMT
యస్ బ్యాంక్ కుంభకోణంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న డీహెచ్ ఎఫ్ ఎల్  ప్రమోటర్లు బిలియనీర్లు కపిల్ వాధ్వాన్ - ధీరజ్ వాధ్వాన్ లను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరోనా లాక్‌ డౌన్‌ నిబంధలను ఉల్లంఘించి, -మహారాష్ట్ర హిల్ రిసార్ట్‌ లోని వారి ఫామ్‌ హౌస్‌ లో విందు చేసుకుంటున్న వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాదు వీరికి అక్కడికి వెళ్లేందుకు అనుమతిచ్చిన ఐఎఎస్ అధికారిపై వేటు వేశారు.

ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే .. కరోనా మహమ్మారి దేశంలో వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో  లాక్‌ డౌన్‌ ను విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలందరూ భౌతికదూరాన్ని పాటిస్తోంటే - వీరు మాత్రం కుటుంబ సభ్యులతో మహాబలేశ్వర్‌ లోని ఫామ్‌ హౌస్‌ కు వెళ్లారు. ఆరు హై-ఎండ్ వాహనాలను గుర్తించిన స్థానికులు వెంటనే మునిసిపల్ అధికారులకు తహశీల్దార్ కు సమాచారం ఇవ్వడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 

దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఇద్దరు  డీహెచ్ ఎఫ్ ఎల్ ప్రమోటర్లతో సహా మొత్తం 23 మంది సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.  అత్యవసరం పరిస్థితి పేరుతో పాస్లు జారీ చేసిన మహారాష్ట్ర ప్రభుత్వ హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ అమితాబ్ గుప్తాను బలవంతపు సెలవుపై పంపారు. వీరు తన కుటుంబ స్నేహితులనీ - కుటుంబ అత్యవసర పరిస్థితుల నిమిత్తం ఖండాలా నుండి మహాబలేశ్వర్ వరకు వెళ్లేందుకు అనుమతించాలంటూ అమితాబ్ గుప్తా పాసులు జారీ చేశారు.

దీంతో వీరంతా బుధవారం రాత్రి ఐదు కార్లలో ముంబైకు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్నఫామ్‌ హౌస్‌  వెళ్లారు. అందులో ఇటలీకి చెందిన వాధ్వాన్ బాడీగార్డ్ ఇందులో వుండటం గమనార్హం. దీంతో ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న అధికారులు వీరందరిపైనా  కేసు నమోదు చేసి - క్వారంటైన్ కి తరలించారు. ఇకపోతే , పలు అవినీతి ఆరోపణల్లో వీరికి  గత నెలలో ఎన్‌ ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించగా,  అది కుదరలేదు. దీనితో  క్వారంటైన్ గడువు ముగిసిన తర్వాత వారిని అదుపులోకి తీసుకోవాలని సీబీఐ భావిస్తోంది.
Tags:    

Similar News