దినేశ్ కార్తీక్.. ఎప్పుడో 2004లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ధోనీ కంటే ముందే జాతీయ జట్టులోకి వచ్చాడు. ధోనీ కంటే మంచి టెక్నిక్ ఉన్న బ్యాట్స్ మన్ కూడా. కానీ, లక్ లేదు. 2007లో ఇంగ్లండ్ లో టెస్టు సిరీస్ గెలిచిన చారిత్రక సందర్భంలో జట్టు సభ్యుడు కూడా. వాస్తవానికి ఆ సిరీస్ లో అత్యధిక పరుగులు (263) చేసిన భారత బ్యాట్స్ మన్ అతడే. అయినా దినేశ్ కార్తీక్ తో లక్ దోబూచులాడింది. చాలాకాలం పాటు జాతీయ జట్టులోకి వస్తూ పోతూ పడుతూ లేస్తూ అతడి ప్రస్థానం సాగింది. చివరగా 2018లో నిదహాస్ కప్ లో చివరి బంతికి సిక్సర్ కొట్టి కప్ అందించిన దాకా దినేశ్ కార్తీక్ అంటే ఎవరికీ పెద్దగా ఆశలు లేవు.
ప్రతిభ ఉన్నా..
నిదహాస్ ట్రోఫీ అందించాక 2019 ప్రపంచ కప్ లో దినేశ్ కార్తీక్ కు చోటు ఖాయమైంది. అయితే, అదేంటో గానీ జట్టు విజయాలు సాధిస్తున్న సందర్భంలో కాకుండా ఓటములు ఎదురైనప్పుడు దినేశ్ జట్టు సభ్యుడిగా ఉండేవాడు. దీనంతటికీ అతడి బ్యాడ్ లక్ లేదా ఏదైనా కారణం అనుకోవచ్చు.
అలా.. 2019 వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్లో జట్టు సభ్యుడైన దినేశ్.. బ్యాట్స్ మన్ గా విఫలమై వేటుకు గురయ్యాడు. తర్వాతి రెండు సీజన్లు సరిగా రాణించలేదు. ఇక పని అయిపోయింది అనుకుంటున్న తరుణంలో ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో బెంగళూరు తరఫున అదరగొడుతున్నాడు. శనివారం దిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్‌లో మరోసారి రెచ్చిపోయాడు. 34 బంతుల్లోనే 5 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 66 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన కార్తీక్ మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీతో ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.
ఈ సందర్భంగా తన ప్రస్తుత, దీర్ఘకాల లక్ష్యాలను వెల్లడించాడు. ఈ ఏడాది అక్టోబరులో ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాకు కప్పు అందించడమే తన పెద్ద లక్ష్యమని అన్నాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ప్రదానం సందర్భంగా తన లక్ష్యాన్ని వెల్లడించిన అతడు అనంతరం విరాట్ కోహ్లి చేసిన ఇంటర్వ్యూలోనూ ఇదే విషయం చెప్పాడు.
నా రాణింపునకు బంగర్ కారణం.. తనకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలున్నాయని చెప్పిన దినేశ్ కార్తీక్.. స్వల్పకాలిక లక్ష్యం బెంగళూరును గెలిపించడమని.. తెలిపాడు. తాను రాణించడానికి కారణం సంజయ్ బంగర్ గా పేర్కొన్నాడు. ''మెగా వేలంలో నన్ను ఫినిషర్ పాత్ర కోసం దక్కించుకున్నామని ఆయన చెప్పినప్పుడు నాకూ ఇదే కావాలనుకున్నా.
అందుకు తగ్గట్టు సన్నద్ధమయ్యా. ఇక దీర్ఘకాలిక లక్ష్యమైతే టీమ్‌ఇండియాకు ప్రపంచకప్ అందించడం. ఈసారి జరిగే టీ20 ప్రపంచకప్ జట్టులో ఉండాలనుకుంటున్నా. అలాగే జట్టు విజయాలు సాధించాలని ఆశిస్తున్నా. టీమ్‌ఇండియా మెగా ట్రోఫీలు సాధించి చాలాకాలమైంది. నేను ఇప్పుడు దాన్ని సాధించి పెట్టాలనే కోరికతో ఉన్నా. అందుకోసం చాలా విషయాలపై దృష్టిసారించాలి'' అని వివరించాడు.
'ప్రతిరోజూ నేను ఒకటే లక్ష్యంతో ప్రాక్టీస్ చేస్తా. నాలో అత్యుత్తమ ఆటగాడు బయటకు వచ్చేందుకు నెట్స్ సెషన్స్‌లో నా కోచ్‌లు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నారు. వారివల్లే ఇది సాధ్యమైంది. వయసు పెరిగేకొద్దీ ఆటగాళ్లు ఫిట్‌గా ఉండాలి. అందుకోసం నా శక్తి కొద్దీ ప్రయత్నిస్తున్నా. ఇప్పుడు బెంగళూరు తరఫున రాణిస్తుండటం సంతోషంగా ఉంది. ఈ జట్టుతో రెండోసారి ఆడుతున్నా. దాంతో ఇక్కడ ప్రత్యేకంగా నిలవానుకున్నా' అని డీకే చెప్పుకొచ్చాడు.
బెంగళూరుకు ఏబీడీ బదులు డీకే
గత సీజన్ వరకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు దక్షిణాఫ్రికా బ్యాట్స్ మన్ ఏబీ డివిలియర్స్ పెద్ద దిక్కుగా ఉండేవాడు. ఫీల్డర్ గా అవసరమైతే వికెట్ కీపర్ గా బాధ్యతలు నిర్వర్తించేవాడు. ఇక ఫినిషింగ్ లో డివిలియర్స్ గురించి చెప్పేదేముంది? కొండంత లక్ష్యాన్ని అయినా కొట్టేసేవాడు. అయితే, అతడు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాక బెంగళూరుకు లోటు ఏర్పడింది. అంతేగాక కోహ్లి కూడా ఫామ్ లో లేకపోవడంతో ఇబ్బంది ఎదురవుతోంది.
దీనిని దినేశ్ కార్తీక్ భర్తీ చేస్తున్నాడు. మంచి ఫామ్ లో ఉన్న అతడు ఫినిషర్ పాత్ర పోషిస్తున్నాడు. శనివారం ఢిల్లీతో మ్యాచ్ లో కార్తీక్ ఆడకుంటే బెంగళూరు పనైపోయేదే. ఈ నేపథ్యంలో.. దినేశ్ ఫినిషర్‌గా బెంగళూరుకు విజయాలు అందించడం చూసి మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ సంతోషిస్తుంటాడని కోహ్లి అనడం విశేషం.