ఫ్లైట్లో జర్నీ చేస్తున్న ధోనీ.. మళ్లీ మనసు దోచేశారుగా

Update: 2023-06-26 10:02 GMT
ఆటతోనూ.. వ్యక్తిత్వంతో కట్టి పడేసే మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి తన తీరుతో అందరి మనసుల్ని దోచేశాడు. అతడికి చెందిన ఒక చిట్టి వీడియో తెగ వైరల్ అవుతోంది. ఫ్లైట్ జర్నీ వేళ.. ఎయిర్ హోస్టెస్ తీసుకొచ్చి ఇచ్చిన చాక్లెట్లు.. డేట్స్ కు ఆయన స్పందించిన తీరు.. స్వీట్.. క్యూట్ గా అతగాడి రియాక్షన్ కు మహి అభిమానులంతా ఫిదా అయిపోతున్నారు. సదరు వీడియో కింద తెగ కామెంట్లు పెట్టేస్తున్నారు.

మహీంద్ర సింగ్ ధోనీ పుణ్యమా అని.. అతగాడి చిట్టి వీడియోతో ఇండిగో.. క్యాడబరీస్.. క్యాండీ క్రష్.. ఓమనీ డేట్స్ ఒక్కసారిగా ఫేమస్ అయ్యాయి. వైరల్ గా మారిన ఈ వీడియోలో.. ఇండిగో ఫ్లైట్ లో జర్నీ చేస్తున్న ధోనికి.. సదరు ఎయిర్ హోస్టెస్ క్యాడబరీస్ చాక్లెట్లు.. 'హ్యాపిలో ఓమినీ డేట్స్' పాకెట్లు ఉన్న ట్రే తీసుకొచ్చి ధోని సీటు పక్కనున్న ట్రేలో పెట్టారు.

ఆ సమయానికి ధోనీ తన ట్యాబ్ లో క్యాండీ క్రష్ ఆడుతున్నాడు.

ఎయిర్ హోస్టెస్ ఆఫర్ చేసిన ట్రేలో కేవలం డేట్స్ (ఖర్జురం) పాకెట్ తీసుకొని.. మిగిలిన చాక్లెట్ ట్రేను తిరిగి ఇచ్చేశారు. ఇప్పుడీ వీడియో వైరల్ గా మారటంతో.. ధోనీ ఆడుతున్న గేమ్ ఏమిటని కొందరు అడగటంకనిపించింది. తాము కూడా ఆ గేమ్ ను డౌన్ లోడ్ చేసుకుంటామని చెప్పటం కనిపిస్తుంది.

అదే సమయంలో.. ధోనీ తీసుకున్న పాకెట్ ఏమిటన్న ప్రశ్నకు నెటిజన్లు బదులిస్తూ.. స్క్రీన్ షాట్ పెట్టేస్తూ.. హెల్త్ కాన్షియస్ ఎక్కువన్న కామెంట్ చేస్తున్నారు. నిజానికి ధోనీ కానీ ఎయిర్ హోస్టెస్ ఆఫర్ చేసిన ట్రేలో ఉన్న క్యాడబరీస్ చాక్లెట్ కానీ తీసుకొని ఉంటే మరోలా ఉండేదేమో.

అయినప్పటికీ.. ధోనీకి ఆఫర్ చేసిన ట్రేలో ఉన్న వాటితో పాటు.. అతడు ఆడుతున్న క్యాండీ క్రష్.. ఇండిగో ఫ్లైట్ అన్నీ ఒక్కసారి వార్తాంశాలుగా మారి.. మరింత ఫేమస్ అయ్యేలా చేశాయి. ధోనీ దెబ్బకు క్యాండీక్రష్ డౌన్ లోడ్స్ విపరీతంగా పెరుగుతాయన్న అంచనా వేశారు. ఈ వీడియోలో ధోనీ సింఫిల్ సిటీ.. ఎయిర్ హోస్టెస్ తో మాట్లాడిన తీరుకు మరింత ఫిదా అవుతున్నారు. ధోనీనా మజాకానా.

Full View



Similar News