రిటైర్మెంట్‌ పై ధోనీ కీలక ప్రకటన

Update: 2023-04-18 17:00 GMT
2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్   ప్రారంభ ఎడిషన్ నుండి ఆడుతున్న ఏకైకా క్రికెటర్ మన ఎంఎస్ ధోని మాత్రమే. కెప్టెన్ గా.. ఆటగాడిగా ఇప్పటివరకూ ప్రతీ సీజన్ ఆడుతూనే వచ్చాడు. దాదాపు15 ఏళ్లుగా ఆడుతూనే ఉన్నాడు. టీమిండియా తరుఫున రిటైర్ మెంట్ ప్రకటించినా ఐపీఎల్ లో మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాడు.

మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్ మెంట్ కు టైం దగ్గరపడింది. అతడి శరీరం ఆటకు సహకరించడం లేదు. మునుపటిలా ఆడడం లేదు. ఫాంలో కూడా లేడు. ధోని  2020లో అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతని మిలియన్ల మంది అభిమానులకు ఈ వార్త షాకిచ్చినట్టైంది.  41 ఏళ్ల ధోని ఐపీఎల్  2023 ఎడిషన్‌లో మరోసారి చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)కి కెప్టెన్సీ వహిస్తున్నాడు. గత సంవత్సరం ఎంఎస్ ధోని తప్పుకొని జడేజాకు పగ్గాలు అప్పగించాడు. ఆ సీజన్ లో చెన్నై వరుసగా ఓడి నిష్క్రమించడంతో జడేజీ తప్పుకున్నాడు. మళ్లీ ధోనినే కెప్టెన్సీ వహించాల్సి వచ్చింది.

ఇటీవల ఒక ఈవెంట్‌లో ధోనీని ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుండి రిటైర్మెంట్ గురించి కొందరు ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. "నేను ఇప్పుడు ఏదైనా ప్రకటన చేస్తే కోచ్ , జట్టుపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ పరిస్థితి తీసుకురావాలని కోరుకోవడం లేదు" అని ఎంఎస్ ధోని బదులిచ్చాడు.. "ఆ రిటైర్మెంట్ తీసుకోవడానికి చాలా సమయం ఉంది. ప్రస్తుతం మాకు చాలా గేమ్స్  ఉన్నాయి. నేను ఏదైనా చెబితే కోచ్ ఒత్తిడిలో ఉంటాడు' అంటూ రిటైర్మెంట్ ఆలోచన లేదని ధోని క్లారిటీ ఇచ్చాడు..

41 ఏళ్ల వయసులో ధోనీ తనను తాను బాగా మెయింటెయిన్ చేసుకున్నాడు. ధోనీ చెన్నై సూపర్ కింగ్స్‌కు కావాలంటే వచ్చే 3 లేదా 4 ఏళ్ల పాటు క్రికెట్ ఆడేందుకు ఫిట్‌గా ఉండగలడని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ అభిప్రాయపడ్డాడు.

నిస్సందేహంగా  ఎ:ఎస్ ధోని ఇటీవల లక్నోపై ఆడిన నాక్ చూస్తే అసలు ధోనికి రిటైర్ మెంట్ అవసరం లేదని అందరూ అంటున్నారు. మార్క్ వుడ్ లాంటి ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బౌలర్‌ బౌలింగ్ లో రెండు బంతుల్లో రెండు సిక్సులు కొట్టిన తర్వాత, ధోని రిటైర్ మెంట్ ఆలోచనలు ఇప్పుడే వద్దు అని అందరూ అంటున్నారు.

ధోని సారథ్యంలోని సీఎస్కే ఐపీఎల్ 2023 సీజన్‌లో మొదటి గేమ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్ లో ఓటమితో ప్రారంభించింది. అయినప్పటికీ, వారు లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ ,  రాజస్థాన్ రాయల్స్‌పై మూడు వరుస విజయాలతో పుంజుకున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ సోమవారం ఎం చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతోనూ గెలిచి మళ్లీ ఫాం అందుకుంది.


Full ViewFull View

Similar News