ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రాజకీయాల్లో సీనియర్ నాయకుడు ఎవరంటే అందరూ చెప్పే మాట ధర్మపురి శ్రీనివాస్.. షాట్ కట్ గా డీఎస్ అని పిలుస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే కీలక నాయకుడిగా ఉన్న ఆయన రాష్ట్ర విభజన అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయన సీనియార్టీని గుర్తించిన టీఆర్ఎస్ అధినేత శ్రీనివాస్ ను రాజ్యసభకు పంపించారు. అయితే అనంతరం జిల్లాలో ఏర్పడ్డ పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం డీఎస్ పార్టీకి దూరమైనా టీఆర్ఎస్ ఎంపీగా కొనసాగుతున్నారు. అయితే ఒక్కసారిగా రాజకీయాలు మారిపోయాయి.
ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో డీఎస్ తన తనయుడు అరవింద్ ను బరిలోకి దింపారు. కాంగ్రెస్ లో, టీఆర్ఎస్ లో అతడికి అవకాశం రాకపోవడంతో బీజేపీలో చేర్పించి అతడి గెలుపునకు పరోక్షంగా డీఎస్ సహకరించారు. ఇదే విషయమై టీఆర్ఎస్ పార్టీకి ఆగ్రహం తెప్పించి ప్రస్తుతం డీఎస్ ను దూరం పెట్టేలా చేసింది. అయితే ప్రస్తుతం అరవింద్ కేసీఆర్ కుమార్తెను ఓడించి ఎంపీగా గెలిచాడు. ప్రస్తుతం బీజేపీలో కీలక నాయకుడిగా ఉన్నాడు. అయితే గతాన్ని మాత్రం అరవింద్ మరచిపోవడం లేదు.
తన తండ్రిని ఎన్నికల్లో ఓడించిన వ్యక్తిపై మాత్రం ప్రతీకారం తీర్చుకుంటున్నాడు. తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు పొందుతూ ఇప్పుడు బీజేపీలో తన హవా కొనసాగిస్తున్నాడు. తన తండ్రిని ఎన్నికల్లో ఓడించిన వ్యక్తిపై ఇప్పుడు రివెంజ్ తీర్చుకున్నాడు. నిజామాబాద్ జిల్లాలో ఎంపీ ధర్మపురి అరవింద్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు యెండల లక్ష్మీనారాయణ మధ్య విబేధాలు ఏర్పడ్డాయి. ఎందుకంటే గతంలో తన తండ్రి ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్)ను యెండల లక్ష్మీనారాయణ ఓడించారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో పోటీ చేసిన డీఎస్ ను యెండల లక్ష్మీనారాయణ ఓడించారు. అయితే అప్పట్లో వదిలేసినా ఇప్పుడు వీరిద్దరూ బీజేపీలోనే ఉన్నారు. తండ్రిని ఓడించారనే కోపంతో పాటు జిల్లాలో తనకు పోటీ ఉండద్దనే విషయంలో అరవింద్ పంతానికి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ జిల్లా అధ్యక్షుడిగా తనకు చెందిన బస్వా లక్ష్మీనారాయణను నియమించుకునేలా చేశారు. దీంతో పాటు యెండల లక్ష్మీనారాయణకు పార్టీలో ప్రాధాన్యం తగ్గించేలా చర్యలు చేపట్టారు. దీంతో నిజామాబాద్ బీజేపీలో ఎంపీ అరవింద్, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ వర్గాలుగా విడిపోయింది.
బీజేపీలో కూడా విబేధాలకు అరవింద్ తెరలేపాడు. ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో యెండల, ధర్మపురి అర్వింద్ మధ్య గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయి. యెండల వర్గానికి అరవింద్ చెక్ పెడుతున్నారు. ఈ క్రమంలో జిల్లా అధ్యక్షుడిగా తనకు చెందిన వ్యక్తిని నియమించుకునేలా అరవింద్ పావులు కదిపాడు. ఇప్పుడు ఈ గ్రూపు రాజకీయాలు పార్టీ నాయకత్వానికి తలనొప్పిగా మారాయి. ఈ విషయమై ఇప్పటికే ఆ పార్టీ రాష్ట్ర, జాతీయ నాయకత్వాలకు ఫిర్యాదులు వెళ్లాయంట. అధిష్టానం, పార్టీ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటో వేచి చూడాలి.