త్రిపుర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొంత కాలంలోనే చాలా వివాదాల్లో చిక్కున్నాడు బిప్లవ్ కుమార్ దేవ్. తాజాగా మాజీ ప్రపంచ సుందరి డయానా హేడెన్ విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. డయానాకు ప్రపంచ సుందరి కిరీటం అసలెందుకు ఇచ్చారో తనకు అర్థం కావడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఐశ్వర్యారాయ్ తో పోల్చి డయానాను తక్కువ చేయడం పట్ల విమర్శలు వ్యక్తమయ్యాయి. డయానా తక్కువ రంగులో ఉండటం వల్లే ఆయనీ వ్యాఖ్యలు చేశారన్న చర్చ మొదలైంది. దీనిపై డయానా స్పందించింది. బిప్లవ్ దేవ్ కు గట్టిగా కౌంటర్ ఇచ్చింది. బిప్లవ్ వ్యాఖ్యలు సిగ్గు చేటని అన్న డయానా.. చామన ఛాయ ఉన్నందుకు తాను గర్విస్తానని.. అలాగే భారతీయురాలైనందుకూ తాను గర్వపడతానని ఆమె అంది. బిప్లవ్ వ్యాఖ్యలు తననెంతో బాధించాయని ఆమె అన్నారు.
తన వ్యాఖ్యలు దుమారం రేపడంతో బిప్లవ్ కూడా వెనక్కి తగ్గారు. తన వ్యాఖ్యలు ఎవరినైనా నొప్పించి ఉంటే మన్నించాలని అన్నారు. భారతీయ చేనేత పరిశ్రమను బాగా మార్కెట్ చేసుకోవాలన్న ఉద్దేశంలో మాట్లాడుతూ తాను ఆ వ్యాఖ్యలు చేశానన్నారు. పూర్వం భారతీయ మహిళలు సౌందర్య సాధనాలు ఉపయోగించలేదని.. మట్టి రుద్దుకుని.. మెంతి నీళ్లతో జుట్టును శుభ్రం చేసుకునేవాళ్లని.. ఐతే అందాల పోటీల పేరుతో ఒక మాఫియా మన దేశంలోకి చొచ్చుకుని వచ్చిందని.. అందుకే ఇప్పుడు ఎటు చూసినా ఒక బ్యూటీ పార్లర్ కనిపిస్తోందని బిప్లవ్ అన్నారు. అందాల పోటీల మాఫియా వాళ్లు ఎవరికి కిరీటం ఇవ్వాలనే విషయం ముందే నిర్ణయిస్తారని.. భారతీయ మహిళల అందానికి ప్రతిరూపమైన ఐశ్వర్యకు వాళ్లు టైటిల్ ఇచ్చారంటే అర్థం ఉందని.. కానీ డయానాకు ఏం చూసి టైటిల్ ఇచ్చారో అర్థం కాలేదని ఆయన మొన్న చేసిన వ్యాఖ్యలు చేసిన పెద్ద గొడవనే సృష్టించాయి.