విశాఖ సభలో సోము ఫేస్ అలా ఎందుకు ఉందంటే...!

Update: 2023-06-14 10:00 GMT
ఏపీలో బీజేపీకి 2019 ఎన్నికల్లో ఒక్క శాతం ఓట్లు వచ్చాయనేది తెలిసిన విషయమే! అయితే ఆ ఎన్నికలు జరిగి నాలుగేళ్లు పూర్తయినా ఏపీలో బీజేపీలో వచ్చిన మార్పేమిటి.. కనిపించిన ఎదుగుదల ఏమిటి.. అంటే ఏపీ బీజేపీ నేతలు ఎవరూ గుండెల మీద చేతులేసుకుని ధైర్యంగా చెప్పలేని పరిస్థితి! అయితే దీనికంతటికీ కారణం సోము వీర్రాజు ఫెర్మార్మెన్స్ అని అమిత్ షా బలంగా భావిస్తున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా తాజాగా సోముకి షా క్లాస్ పీకారని సమాచారం!

అవును... ఏపీలో బీజేపీ పరిస్థితిలో మార్పు రాలేదు సరికదా ఉన్న ఒక్క ఎమ్మెల్సీ స్థానాన్నీ కోల్పోయింది. ఇదే సమయంలో కన్నా లక్ష్మీనారాయణ వంటి సీనియర్ నేత పార్టీ మారిపోయిన పరిస్థితి. ఆయంతోపాటు కేడర్ కూడా దూరం జరుగుతున్న వైనం. అయితే వీటన్నింటికీ సోము అసమర్ధతే కారణం అని షా బలంగా నమ్ముతున్నారంట. ఫలితంగా తాజాగా విశాఖలో జరిగిన సభకు ముందు గట్టిగా క్లాస్ పీకారాని అంటున్నారు.

కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీకి దక్షిణాదిలో దారులు మూసుకుపోయాయనే చర్చ తెరపైకి వచ్చింది. ఇక బీజేపీ నార్త్ కే పరిమితం అనే కామెంట్లు వినిపించాయి. దీంతో బీజేపీ అగ్రనాయకత్వం అలర్ట్ అయ్యింది. తమిళనాడు, తెలంగాణ, ఆంద్రప్రదేశ్ లపై ప్రత్యేక శ్రద్దపెట్టడం మొదలుపెట్టింది.

ఈ సమయంలో ఏపీ బీజేపీ చీఫ్ నుంచి ఆశించిన స్థాయిలో ఫెర్మార్నెస్ కనిపించని పరిస్థితి అమిత్ షా ను పునరాలోచనలో పాడేసిందని అంటున్నారు! అయితే ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ చీఫ్ ని మారుస్తారా.. లేక, కొనసాగిస్తారా అన్నవిషయంలో స్పష్టత లేదు కానీ... జరుగుతున్న పరిణామాలు, విశాఖ సభ తర్వాత మారిన వీర్రాజు టోన్ లు మాత్రం... పైన పేర్కొన్న విషయాన్ని మరింత స్పష్టం చేస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు!

అయితే వీర్రాజుకు షా క్లాస్ పీకడమే కాకుండా… కొన్ని కీలక సూచనలు చేశారని అంటున్నారు. ప్రస్తుతం పొత్తుల గురించి స్పందించడం వంటివి చేయకుండా… అవసరమైతే విపక్ష పార్టీలన్నింటినీ కలుపుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని, పార్టీని మరింత యాక్టివేట్ చేయాలని సూచించారట. ఇదే సమయంలో కేడర్ లో కదలికలు తీసుకొచ్చే కార్యక్రమాలు ఆలోచించి ఆచరణలో పెట్టాలని తెలిపారంట.

మరి ఈ క్లాస్ అనంతరం వీర్రాజు అలకపానుపు ఎక్కుతారా.. లేక, దూకుడు పెంచి అమిత్ షా మెప్పు పొందుతారా అనేది వేచి చూడాలి!

Similar News