అత్యంత అమానుష ఘటనకు చరిత్రలో దక్కిన చోటు ఎంతన్న ప్రశ్నను సంధిస్తూ.. బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి సంధించిన అస్త్రం కశ్మీర్ ఫైల్స్. కశ్మీర్ వ్యాలీలో పండిట్ల ఊచకోతకు కళ్లకు కట్టేలా చూపించిన దర్శకుడిపై ఇప్పుడు యావత్ భారతదేశంలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఎప్పటిలానే విమర్శలు ఉన్నాయనుకోండి. కాకుంటే.. ఈ సినిమాకు జనాదరణ ఎక్కువగా ఉండటం.. దర్శకుడి ప్రయత్నానికి ప్రజల నుంచి సానుకూల స్పందన రావటమే కాదు.. ఇంత దారుణం జరిగి కూడా మనకు అంతగా తెలీకపోవటం ఏమిటన్న భావనను రగిలేలా చేయటంలో వివేక్ అగ్నిహోత్రి సక్సెస్ అయ్యారని చెప్పాలి.
ఇదిలా ఉంటే.. దేశ రాజకీయాల్ని సైతం ఈ సినిమా తీవ్రంగా ప్రభావితం చేసిందని చెప్పాలి. ఈ సినిమాకు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వినోద పన్ను మినహాయింపు ఇవ్వటంతో పాటు.. ఈ సినిమాను కమలనాథులు పెద్ద ఎత్తున ప్రమోట్ చేయటం తెలిసిందే. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇలాంటివేళ.. ఈ సినిమాను అదే పనిగా ప్రమోట్ చేస్తున్న కమలనాథులపై తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేత.. ఢిల్లీ రాష్ట్ర డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా విరుచుకుపడ్డారు. సినిమాను ప్రమోట్ చేస్తున్న బీజేపీ అధినాయకత్వం.. కశ్మీర్ పండిట్లకు ఎలాంటి న్యాయం చేసిందో చెప్పాలంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు.
కశ్మీర్ ఫైల్స్ మూవీతో తన ప్రత్యర్థులకు దిమ్మ తిరిగే షాకిస్తున్న బీజేపీకి.. నోటమాట రాని రీతిలో రియాక్టు అవుతోంది ఆమ్ ఆద్మీ పార్టీ. బీజేపీ కేవలం కశ్మీర్ ఫైల్స్ సినిమా కోసం ఆందోళన చెందుతుందే తప్పించి.. కశ్మీరీ పండిట్ల కోసం కాదంటూ మండిపడ్డ ఆయన..కశ్మీర్ పండిట్ల కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చాలానే చేశారని చెప్పుకొచ్చారు.
సరైన డాక్యుమెంట్లు లేకున్నా 233 మంది ఉపాధ్యాయులకు శాశ్వత హోదా కల్పించారని.. వారికి పెన్షన్ వ్యవస్థను క్రమబద్ధీకరించారని.. ఢిల్లీలోని కశ్మీర్ పండిట్లకు నెలకు రూ.3వేలు చొప్పున అందించినట్లు ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు.. కశ్మీర్ పండిట్లకు కావాల్సింది సినిమా కాదని.. తగిన న్యాయమంటూఆయన చేసిన వ్యాఖ్య కమలనాథులకు కొత్త కంగారును తెచ్చి పెడుతోంది.
కేంద్రంలో ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ కశ్మీర్ పండిట్లకు ఏం న్యాయం చేసిందో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. తమ ప్రాంతానికి తిరిగి వెళ్లాలని కశ్మీర్ పండిట్లు కోరుకుంటున్నారని.. అందుకు తగ్గ అవకాశాల్ని వారు ఆశిస్తున్నారని.. మరి బీజేపీ ఏం చేసిందని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ కేవలం కశ్మీర్ ఫైల్స్ మూవీ కోసం మాత్రమే ఆందోళన చెందుతుందే తప్పించి.. కశ్మీర్ పండిట్ల కోసం కాదన్న ఆయన మాటలకు కమలనాథులు సరైన రీతిలో రియాక్టు కాలేకపోవటం గమనార్హం. కశ్మీర్ ఫైల్స్ మూవీతో తన రాజకీయ ప్రత్యర్థుల్ని ఇరుకున పడేసిన బీజేపీని ఇదే అంశంలో ఆత్మరక్షణలో పడేసే విషయంలో ఆమ్ ఆద్మీ సక్సెస్ అయ్యిందని చెప్పక తప్పదు.