జాతీయ చిహ్నంలోని సింహాలను గర్జించేలా చేసిన మోడీ.. సోషల్ మీడియాలో సెటైర్లు
ప్రధాని మోడీ ఏదైనా కొత్తగా.. వినూత్నంగా చేయాలనుకుంటారు. అది చినిగా చాటై వివాదానికి దారితీస్తుంది. భారత నూతన పార్లమెంట్ ఎదుట కొత్తగా ఏర్పాటు చేసిన జాతీయ చిహ్నం చూసి బీజేపీ శ్రేణులు అబ్బో అంటూ చంకలు గుద్దుకున్నారు. ఆ మూడు సింహాల గుర్తును చూసి అబ్బురపడ్డారు. కానీ అది ఎంత పెద్ద తప్పు ఉందో గుర్తించలేకపోయారు. మోడీ సార్ ఏకంగా సింహాల రూపు మార్చేసి సైలెంట్ గా ఉన్న సింహాల సింబల్ ను అరిచేలా రూపొందించడం దుమారం రేపింది.
నిర్మాణంలో ఉన్న కొత్త పార్లమెంట్ పైన జాతీయ చిహ్నాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఆవిష్కరించారు. ఈ చిహ్నం కాంస్య లోహంతో తయారు చేయబడింది. సుమారు 9500 కిలోల బరువు మరియు 6.5 మీటర్ల ఎత్తు ఉంటుంది. అయితే చిహ్నంలో ఉన్న సింహాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. మోడీ సర్కార్ జాతీయ చిహ్నంలోని సింహాలను మార్చేశారు. ఇదే ఇప్పుడు రాజకీయ దుమారం చెలరేగింది. మొదటగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ హిందూ ఆచారాలను ఆచరిస్తూ జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించడాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. రెండవది చిహ్నంలో సింహాల వ్యక్తీకరణ తప్పుగా తీర్చిదిద్దడం వివాదమైంది.
కొత్త చిహ్నంలో సింహాలు వికృతంగా కనిపిస్తున్నాయని ప్రముఖ కాలమిస్ట్ స్వాతి చతుర్వేది అభిప్రాయపడ్డారు. "ఒరిజినల్ మూడు సింహాలు, చాలా గ్రేస్ & గాంభీర్యం ఉంటే.. మోడీ సర్కార్ తీర్చిదిద్దిన కొత్తది గర్జించేలా ఉన్నాయి. చైనా బ్యాడ్ కాపీలో తయారు చేయబడినట్లుగా అగ్లీగా ఉన్నాయి" అని స్వాతి ట్వీట్ చేసింది.
ప్రఖ్యాత న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కూడా విమర్శలు గుప్పించారు. "గాంధీ నుండి గాడ్సే వరకు.. గంభీరంగా & శాంతియుతంగా కూర్చున్న సింహాలతో మన జాతీయ చిహ్నం చూశాం. కానీ కొత్త పార్లమెంట్ భవనం పైభాగానికి ఆవిష్కరించిన కొత్త జాతీయ చిహ్నానికి కోపిష్టి కోరలు గల సింహాలు ఎబ్బెట్టుగా ఉన్నాయి. ఇది మోదీ కొత్త భారతదేశం!" అంటూ సెటైర్లు వేశారు.
నిజానికి చిహ్నాన్ని జాగ్రత్తగా పరిశీలించినప్పుడు సింహాలు చాలా దూకుడుగా కనిపిస్తాయి. అశోకుడు రూపొందించిన మన జాతీయ చిహ్నంలో సింహాలు గర్జించవు. ఠీవీగా తీక్షణంగా చూస్తాయి. అయితే అసలైనది పక్కనపెట్టి మోడీ సర్కార్ చెక్కించిన ఈ జాతీయ చిహ్నం ఇఫ్పుడు వివాదాస్పదమైంది. కొత్త రూపంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ (కొత్త పార్లమెంట్)ను త్వరగా పూర్తి చేయాలని భావిస్తోంది. ఈ సంవత్సరం అక్టోబర్ నాటికి ఇది పూర్తవుతుందని అంచనా వేయబడింది. కానీ ఈ విషయంలో ఆదిలోనే విమర్శలు వినిపిస్తున్నాయి.