టీడీపీకి రాజకీయ వ్యూహకర్త గుడ్ బై చెప్పేశారా ?

Update: 2022-09-23 04:37 GMT
షెడ్యూల్ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో రాజకీయ వ్యూహకర్త తెలుగుదేశంపార్టీకి గుడ్ బై చెప్పినట్లు ప్రచారం మొదలైంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే అధికారంలోకి రావాల్సిందే అని చంద్రబాబునాయుడు పట్టుదలగా ఉన్నారు. ఇందులో భాగంగానే ముందు రాబిన్ శర్మను తర్వాత సునీల్ కానుగోలును వ్యూహకర్తలు నియమించుకున్నారు. అయితే మంది ఎక్కువైతే మజ్జిగా పలుచన అవుతుందన్న పద్దతి తయారైందట.

ఒకే విషయంలో ఒకేపనిమీద పనిచేస్తున్న ఇద్దరు వ్యూహకర్తల మధ్య గొడవలు మొదలయ్యాయని సమాచారం. నిజానికి ఇద్దరు వ్యూహకర్తలను నియమించుకునే ముందు చంద్రబాబే ఈ విషయాన్ని ఆలోచించుండాల్సింది. ఏకకాలంలో ఒకేపార్టీలో అదీ ఒకే రాష్ట్రానికి ఇద్దరు వ్యూహకర్తలు ఏ విధంగా పనిచేయగలరు ? ఎందుకంటే ఇద్దరిలో ఎవరు గొప్పనే ఇగో క్లాషస్ కచ్చితంగా వస్తాయి. పైగా ఇద్దరికీ ప్రత్యేకంగా వాళ్ళ వాళ్ళ బృందాలున్నాయి.

పైగా ఇద్దరు కూడా ఎంతోకొంత పేరున్న వాళ్ళే కావటంతో ఇగో క్లాషస్ మొదలయ్యాయి. దీనివల్ల ఎవరేమి పనిచేస్తున్నారో కూడా పార్టీలో అర్ధం కావటంలేదు. చేస్తే ఒకే పనిని ఇద్దరు చేయటం లేదా ఇద్దరూ ఒకే విషయమై వేర్వేరుగా రిపోర్టులు ఇస్తున్నారు.

దాంతో పార్టీ నేతల్లో కూడా గందరగోళం పెరిగిపోతోంది.  నియోజకవర్గాల్లో ఎవరికి టికెట్లివ్వాలి ? ఏ అభ్యర్ధి బలమెంత ? ప్రత్యర్ధుల బలాలు, బలహీనలేమిటి ? అనే విషయాల్లో ఇద్దరు వేర్వేరు నివేదికలను అందిస్తున్నారట.

జరుగుతున్నదంతా గమనించిన సునీల్ ఇదే విషయాన్ని చంద్రబాబుతో చెప్పారట. అయితే కొంతకాలం అయిన తర్వాత అందరం కూర్చుని సమీక్ష చేసుకుందామని చంద్రబాబు నచ్చచెప్పారని పార్టీవర్గాలంటున్నాయి.

అయితే ఈ పద్దతి నచ్చక చివరకు సునీల్ తాను తప్పుకోవాలని డిసైడ్ అయ్యారట. ఇదే విషయాన్ని డైరెక్టుగా చంద్రబాబుతోనే చెప్పేశారట. ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కాబట్టి ఇపుడే తాను తప్పుకుంటే తనకు, పార్టీకి కూడా మంచిదని స్పష్టంగా చెప్పారట. మరి చంద్రబాబు ఏమిచెప్పారు ? చివరకు ఏమవుతుందనేది సస్పెన్సుగా మారింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News